CPI Narayana : చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఎందుకు అక్కసు?

Analysis On CPI Narayana Press Meet : సీపీఐ నారాయణ వ్యాఖ్యలు దేనికి సంకేతం.. వెంకయ్య నాయుడుపై సానుభూతి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై అక్కసు వెళ్లగక్కడం ఇదేమీ రాజకీయం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో మాట్లాడిన మాటలు చూసి అందరూ విమర్శిస్తున్నారు. చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు.. అసభ్య పదజాలంతో.. ఎవరూ చిరంజీవిని అననటువంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రెండోది పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు చేశాడు నారాయణ. పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్ మైన్.. […]

Written By: NARESH, Updated On : July 20, 2022 8:04 pm
Follow us on

Analysis On CPI Narayana Press Meet : సీపీఐ నారాయణ వ్యాఖ్యలు దేనికి సంకేతం.. వెంకయ్య నాయుడుపై సానుభూతి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై అక్కసు వెళ్లగక్కడం ఇదేమీ రాజకీయం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో మాట్లాడిన మాటలు చూసి అందరూ విమర్శిస్తున్నారు. చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు.. అసభ్య పదజాలంతో.. ఎవరూ చిరంజీవిని అననటువంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

రెండోది పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు చేశాడు నారాయణ. పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్ మైన్.. నిలకడలేని మనస్తత్వం అంటూ పవన్ ను నమ్మవద్దని విమర్శించారు.

మూడోది వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కాలేడని.. ఉపరాష్ట్రపతిగా కూడా కొనసాగించడం లేదని.. వెంకయ్యనాయుడును పక్కనపెట్టారని బీజేపీపై నారాయణ విమర్శలు గుప్పించారు. వెంకయ్యపై ఎక్కడలేని సానుభూతి. కమ్యూనిస్టుల్లో అసలు బంధుత్వాలు కూడా ఆలోచించకుండా ముందుకెళుతారు. కానీ ఇక్కడ నారాయణ తన సహజశైలికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.

కమ్యూనిస్టులకు బీజేపీ బద్ద వ్యతిరేకి. బీజేపీలో ఉన్న వ్యక్తులపై సానుభూతి చూపించిన సీపీఐ నారాయణ తీరు కమ్యూనిస్టుల సిద్ధాంతానికే వ్యతిరేకం. సీపీఐ నారాయణ తన సామాజిక వర్గానికి చెందిన వెంకయ్యను భుజాన వేసుకొని మోస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. వెంకయ్యకు ఏపీకి చెందిన ఎవరూ సాయం చేయకపోయినా.. వెంకయ్యకు మోడీ 3 సార్లు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు. జాతీయ అధ్యక్ష పదవితోపాటు దేశానికే రెండో పౌరుడిగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..