Analysis On Chandra Babu Telangana Political Entry : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు.. పదవి, అధికారం కోసం మిత్రులను పక్కన పెడతారు. శత్రువులను చేరదీస్తారు. ఇదే సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడు.. అనే ఫార్ములాను రాజకీయంగా తమ అవసరానికి అనుగుణంగా వాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారు.
తెలంగాణలో ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న టీడీపీ క్యాడర్‌ను ఉత్సాహపరిచే చర్యలు చేపట్టారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ఖమ్మంలో పర్యటించారు. భారీ సభ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ అభిమానులు కూడా తరలివచ్చారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీని క్రియాశీలకంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందని సంచలన వ్యాఖ్య చేశారు. ఇదే సమయంలో ఆయన ఘర్ వాపసీ పాలసీ ప్రకటించారు. పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీడీపీలోకికి రావాఆలని పిలుపునిచ్చారు.
గతంలో అనేక మంది నాయకులు టీడీపీ తరఫున గెలిచారని.. అయితే వివిధ కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లారని చెప్పారు. ఎందుకు వెళ్లారు.. అని తాను అడగబోనని చెప్పిన చంద్రబాబు పార్టీ అవసరం అనుకునే నేతలంతా తిరిగి రావాలని కోరడం చర్చకు దారితీసింది. కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలను తయారుచేసి తెలంగాణలో టీడీపీని పునర్నిర్మించి.. పూర్వ వైభవం తీసుకొద్దామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.
తెలంగాణ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి తాను దగ్గర కావాలనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో యుద్ధం చేస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చి తెలంగాణ నుంచి బాబును ఆంధ్రాకు తరిమేశాడు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ఉమ్మడి శత్రువుగా చూపి… బీజేపీతో మైత్రి చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో సరైన క్యాడర్ లేని బీజేపీని అధికారంలోకి తేవడానికి సహకరించి.. ఆంధ్రాలో మళ్లీ తాను అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మలో బాబు బలప్రదర్శన చేశారన్న అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది.
చంద్రబాబు తెలంగాణలో బలం పెంచుకోవాలనుకోవాలనుకుంటున్నారు..చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎంట్రీని ఎలా చూడాలి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.