Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ను కలిసి రాష్ర్టంలో పరిస్థితిపై వినతిపత్రం అందజేశారు. రాష్ర్టంలో పాలన గురించి ఆయనకు వివరించారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవాలని అనుకున్నా ఆయన జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉండడంతో వీలు కాలేదు. దీంతో ఆయన కశ్మీర్ పర్యటన నుంచి తిరిగి వచ్చాక చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్టాడారు.

రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు దాడులు చేయడంపై అమిత్ షాకు వివరించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని బాధితులపైనే దాడులు చేయడం ఏమిటని తెలిపారు. బాబు చెప్పిన మాటలు విన్న అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని అన్నారు. అధికార పార్టీకి దాసోహం అంటూ అధికారులు వారు చెప్పిందే వేదంగా పాటిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ర్టపతికి ఎనిమిది పేజీల మెమోరాండం అందజేశారు. అప్పుడే అమిత్ షాను కలవాలనుకున్నా ఆయన కశ్మీర్ పర్యటనతో కుదరలేదు. దీంతో అమిత్ షా తిరిగి వచ్చాక చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: Delhi: ఏంట్రా ఇదీ.. గుట్కా కోసం కత్తులతో చంపుకున్నారు..
రాష్ర్టంలో డ్రగ్స్, గంజాయి వాడకం పెరిగిపోయింది. దీంతో అడ్డుకునే క్రమంలో తమపై దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలతోపాటు నేతల ఇళ్లపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. దాడులపై సీబీఐ చేత విచారణ జరిపించాలని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ను రీకాల్ చేయాలని అన్నారు.
Also Read: ChandraBabu Naidu Wedding Card: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?