https://oktelugu.com/

Allu Arjun Sajjanar: సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన అల్లు అర్జున్, ర్యాపిడో

Allu Arjun Sajjanar: తెలంగాణ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దెబ్బకు ర్యాపిడో సంస్థ అబ్బా అంది. ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇచ్చిన వార్నింగ్ కు అల్లు అర్జున్ దిగివచ్చాడు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ర్యాపిడోకు, అల్లు అర్జున్ కు ఆర్టీసీని అవమానించేలా ప్రకటన చేసినందుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ససేమిరా అన్న ర్యాపిడో సంస్థ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2021 / 05:51 PM IST
    Follow us on

    Allu Arjun Sajjanar: తెలంగాణ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దెబ్బకు ర్యాపిడో సంస్థ అబ్బా అంది. ఈ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇచ్చిన వార్నింగ్ కు అల్లు అర్జున్ దిగివచ్చాడు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ర్యాపిడోకు, అల్లు అర్జున్ కు ఆర్టీసీని అవమానించేలా ప్రకటన చేసినందుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ససేమిరా అన్న ర్యాపిడో సంస్థ తాజాగా సజ్జనార్ దెబ్బకు కిందకు దిగివచ్చింది.

    allu-arjun-sajjanar

    తెలంగాణ ఆర్టీసీ సిటీ బస్సును ఉపయోగించుకొని యాడ్ లో చిత్రీకరించిన సన్నివేశాలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ర్యాపిడో సంస్థ. ఈ మేరకు ర్యాపిడో సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది.

    ఇటీవల బైక్, ట్యాక్సీ రైడింగ్ సంస్థ ‘ర్యాపిడో’ యాడ్ లో ప్రముఖ టాలీవుడ్ అగ్రహీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. ఈ ప్రకటనలో ‘ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయి. ర్యాపిడో చాలా వేగంగా.. సురక్షితంగా ఉంటాయని.. అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని’ ప్రకటనలో అల్లు అర్జున్ అన్నాడు.

    ఈ ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భగ్గుమన్నారు. ఈ యాడ్ పై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను తక్కువ చూపడాన్ని సజ్జనార్ ఖండించారు. టీఎస్ ఆర్టీసీని కించపరడాన్ని ఉద్యోగులు, ప్రయాణికులు, సంస్థ సహించదని.. సమాజం కోసం ప్రజారవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలని సజ్జనార్ హితవు పలికారు. అందుకే ఇందులో నటించిన అల్లు అర్జున్ కు.. ప్రకటనను ప్రసారం చేసిన ‘ర్యాపిడో’ సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు.

    ఈ క్రమంలోనే ర్యాపిడో సంస్థ వెనక్కి తగ్గింది. ఆర్టీసికి క్షమాపణలు చెప్పింది. దీంతో సజ్జనార్ దెబ్బకు అటు ర్యాపిడో సంస్థ అల్లు అర్జున్ వెనక్కి తగ్గినట్టుగా సమాచారం.