Vangaveeti Ranga: అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా నిజం చేయవచ్చు కానీ.. నిజాన్ని మాత్రం మరుగున పడేయ్యలేం. ఏపీలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నది అదే. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. పొలిటికల్ పార్టీలకు సొంత మీడియా తోడైన తరువాత ఈ తరహా చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఎల్లో మీడియా, నీలి మీడియా, కూలి మీడియా ఇలా విభిజనకు గురయ్యాయి. ప్రజలు కూడా ఓ మీడియా వార్తలను చూసి నిర్థారణకు రాలేకపోతున్నారు. తటస్థ మీడియాను చూసి వార్తలు, కథనాల్లో నిజానిజాలను తెలుసుకుంటున్నారు.
ఎల్లోమీడియాగా చెప్పుకునే ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీల కథనాలు, డిబేట్లు ఒకలా ఉంటాయి. వీరు చెప్పిందే వాస్తవం. చూపిందే వార్త అన్నట్టు సాగుతోంది వీరి వ్యవహారం. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అయితే బరితెగించి వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ టీడీపీ, చంద్రబాబు పల్లకి మోయడం దీని పని. ఈ క్రమంలో కొన్నిసార్లు తన చర్యలతో అబాసుపాలవుతుంటుంది. నెటిజన్లకు అడ్డంగా బుక్కవుతుంటుంది. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా హత్యకు సంబంధించి డిబేట్ లో వెంకట కృష్ణ ఓవారక్షన్ చేసి అడ్డంగా బుక్కాయ్యారు.
1988లో వంగవీటి దారుణ హత్యకు గురయ్యారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వర్గ పోరులో భాగంగా రంగాను హత్య చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వంలో చంద్రబాబుది యాక్టివ్ రోల్. నాటి టీడీపీ సీనియర్ ఉపేంద్ర, చంద్రబాబు ఈ ఘటన వెనుక ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కానీ ఎక్కడా రుజువు కాలేదు. కాలక్రమంలో రంగా హత్య మరుగునపడిపోయింది. కానీ రంగా క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. తన తండ్రి మరణం వెనుక టీడీపీ ఉందని ఆరోపణలు చేసిన రంగా కుమారుడు రాధా ఇప్పుడు అదే పార్టీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి. దీంతో తరచూ రంగా హత్యను రాజకీయ నాయకులు ప్రస్తావిస్తూ ఉంటారు.
టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకుంటాయని వార్తలు వస్తున్న తరుణంలో కాపు ఓటు బ్యాంకుపై అధికార వైసీపీ ఫోకస్ పెంచింది. ముద్రగడను పార్టీలో చేర్చుకోవడంతో పాటు రంగా హత్యను తెరపైకి తెస్తోంది. రంగాను హత్యచేయించిన చంద్రబాబుతో ఎలా అంటగాకుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. వెంకట కృష్ణ సంయమనం కోల్పోతూ వంగవీటి మోహన్ రంగాను టీడీపీ వాళ్లు హత్యచేస్తే మీకు మంట ఏమిటని అనేశారు. దీంతో ఇది పెను దుమారంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్యలను తప్పుపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Abn andhra jyothi has been booked in the matter of vangaveeti mohana ranga
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com