Ukraine Telugu Doctor: అతడో జంతు ప్రేమికుడు. దేశం కాని దేశం ఉక్రెయిన్ లో స్థిరపడ్డాడు. వృత్తి రీత్యా వైద్యుడు. ప్రవృత్తి జంతు ప్రేమికుడు. దీంతో అతడు రెండు పులులను సంరక్షిస్తున్నాడు. వాటితోనే కాలక్షేపం. వృత్తి అయిపోయిందంటే వాటితోనే గడుపుతాడు. అవి లేకపోతే అతడికి ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే వాటిని తమ పెంపుడు పిల్లలుగా పెంచుకుంటున్నాడు. అవి లేనిదే అతడినికి నిద్ర పట్టదు. అంతలా వాటితో అనుబంధం ఏర్పడింది. అవి కూడా అతడు లేకపోతే తిండి తినవు. నీళ్లు కూడా తాగవు. వారి మధ్య ప్రేమానుబంధం పెరగడంతో పులులపై అతడికి మక్కువ ఏర్పడింది. పులులకు అతడికి అవినాభావ సంబంధం పెనవేసుకుంది.

కానీ కాలం ఒకలా ఉండదు. ఒకోసారి బండ్లు ఓడలవుతాయి. మరో సందర్భంలో ఓడలు బండ్లవుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీంతో రెండు దేశాల మధ్య బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిన వైద్యుడు గిరి కుమార్ పాటిల్ పులుల సంరక్షణ చేస్తూ వైద్యుడిగా స్థిరపడ్డాడు. రష్యాతో యుద్ధంలో అతడి ఆస్పత్రిని మూసేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బతుకుదెరువు పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు.
రెండు వారాల క్రితం తన దగ్గరున్న డబ్బులు అయిపోయాయి. ఇక పులుల సంరక్షణ భారంగా అనిపించింది. దీంతో వాటిని ఓ రైతు దగ్గర వదిలేశాడు. తన వద్ద ఉన్న పులుల్లో మగపులి లెప్ జ్యాగ్ వయసు 24 నెలలు, ఆడపులి జాగ్వర్ వయసు 14 నెలలు ఉన్నాయి. వాటి ఆలనాపాలనా చూసే వైద్యుడికి కూడా కష్టమొచ్చింది. తన ఆస్తిని అమ్ముకుని ఓ రైతు వద్ద వాటిని ఉంచి అతడికి రూ.8 వేలు ఇచ్చి వాటికి తిండి పెట్టాలని సూచించారు. రోజు రైతుకు ఫోన్ చేసి అవి ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు. అతడు వెళ్లిన నుంచి అవి కూడా సరిగా తిండి తినడం లేదట. యజమానిపై ఉన్న ప్రేమతోనే అవి ఇలా చేస్తున్నాయని తెలుస్తోంది.

డాక్టర్ పోలెండ్ కు వలస పోయాడు. ఒక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉక్రెయిన్ లోని రెండు రెస్టారెంట్లు, రెండు కార్లు, రెండు మోటార్ సైకిళ్లు, కెమెరాను రూ. లక్ష డాలర్లకు మన కరెన్సీలో రూ.81, 63, 840 లకు విక్రయించినట్లు చెబుతున్నాడు. విధి ఆడిన వింత నాటకంలో డాక్టర్ పాత్రకు ఎంతో కష్టమొచ్చింది. దర్జాగా బతికిన అతడు పొట్ట చేత పట్టుకుని పోలెండ్ కు పారిపోవడం గమనార్హం. విధికి ఎవరు కూడా అతీతులు కారు. అది పడగ విప్పిందంటే మన జీవితం బుగ్గే. దీనికి మంచి ఉదాహరణే డాక్టర్ జీవితం.
కేవలం పులులకు తిండిపెట్టేందుకు అతడు రోజుకు 300 డాలర్లు ఖర్చు పెట్టేవాడు. అవి రోజుకు ఐదు కిలోల మాంసం అవలీలగా తింటాయి. ఉక్రెయిన్ లో పరిస్థితి విషమించడంతో దేశం విడిచి పోయాడు. పులులకు మూడు నెలలకు సరిపడే ఆహారం ఫ్రీజ్ లో పెట్టి కేర్ టేకర్ కు అప్పగించాడు. ఈ నేపథ్యంలో పులులను విడిచి వెళ్లిన వైద్యుడు ఎంతో కొంత సంపాదించుకుని మళ్లీ ఉక్రెయిన్ కు రావాలని ఉందని చెబుతున్నాడు.