Modi Putin Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో పర్యటించి వెళ్లారు. ఇరు దేశాధినేతలు అనేక అవశాలపై చిర్చించారు. కీలక ఒప్పందం చేసుకున్నారు. ఇక పుతిన్‌కు భారత్ ఘనమైన అతిథి మర్యాదలు ఏర్పాటు చేసింది. మోదీ పుతిన్‌కు జ్ఞాపికగా రష్యన్ భాషలో ముద్రించిన భగవద్గీత అందించారు. ఇదిలా ఉంటే.. మోదీ పుతిన భేటీ సమయంలో ఇద్దరి మధ్యలో ఉంచిన ఒక మొక్క ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఒక ఎరుపు పసుపు రంగులోని హెలికోనియా మొక్క అందరినీ ఆకర్షించింది. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
హెలికోనియా మొక్క ప్రత్యేకతలు
హెలికోనియా సానుకూల శక్తుల ప్రతీకగా పరిచయమవుతుంది. ఇది వద్ధి, శ్రేయస్సు, సమతుల్యత, సామరస్యానికి సూచికగా భావించబడుతుంది. కొత్త ఆరంభాలకు, ముందడుగు వేయడంలో ఆశీర్వాదంగా భావిస్తారు.
దౌత్య ప్రదేశాల్లో ప్రాముఖ్యత
అత్యున్నత స్థాయి సమావేశాల కోసం నిర్వహించే వేదికల్లో అన్ని అంశాలు యాదచ్ఛికంగా ఉండవు. పూల ఎంపిక, రంగుల సమన్వయం, బలమైన సందేశ అవసరం కోసం బాగుంటాయి. అందువల్ల, ఇది ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సంకేతంగా భావిస్తున్నారు.
పుతిన్–మోదీ మధ్య మరింత బలమైన ఫ్రెండ్‌షిప్, ద్వైపాక్షిక సహకారం అభివృద్ధికి ఈ మొక్క ప్రత్యక్ష ప్రతీకగా నిలిచింది. నికరంగా ఒక చిన్న అంశం గా కనిపించినా, దీని అర్థాలు వాణిజ్య, సాంస్కృతిక, రాజకీయ పరంగా కీలక సంకేతాలుగా మారాయి.