CM KCR: తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మొన్నటి వరకు ఏ పార్టీ పోటీ లేదని భావించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ కంట్లో నలుసులాగా మారింది. దీంతో హ్యాట్రిక్ కోసం కొత్త కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వస్తోంది. గెలుపు సునాయసం అనుకున్న తరుణంలో రోజురోజుకు ఓటరు నాడి మారిపోతుండడంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈతరుణంలో గెలుపుకోసం అన్నీ అస్త్రాలను ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు కొన్ని వర్గాలు బీఆర్ఎస్ కు అనుకూలమని భావిస్తోంది. మరికొందరిని ఎలాగోలా తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా సైలెంట్ ఓటర్ పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతీ ఎన్నికల్లో సైలెంట్ ఓటరు చాలా దెబ్బ కొడుతారు. సైలెంట్ ఓటర్లలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. వీరిలో 25 నుంచి 35 ఏళ్ల వారు పార్టీని కాకుండా అభ్యర్థిని చూస్తారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వం ఏం చేసింది? అనేది పరిశీలిస్తారు. రైతులు, వృద్ధులతో పాటు కొన్ని వర్గాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉంది. మరికొందరికి గాలం వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయతే సైలెంట్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల మరింత ఈజీ అవుతుందని బీఆర్ఎస్ టీం ఆలోచిస్తుంది.
ఇందులో భాగంగా ఇలాంటి ఓటర్ ను ప్రత్యేకంగా వర్గీకరిస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఏమైనా పథకాలు అందాయా? లేకపోతే భవిష్యత్ లో ఎలాంటి పథకాలు వర్తిస్తాయో వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలలో గతంలోలాగే రైతులు, వృద్ధులకు ప్రత్యేకంగా పథకాలు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ వారికి ఎలాంటి ప్రత్యేక పథకాలు ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ముందు గృహలక్ష్మి పథకం అందుబాటులోకి తీసుకొచ్చినా దాని ఫలాలు అందకముందే ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఈ ఐదేళ్లలో తమకు ఒరిగిందేమిటి? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే వీరిని అక్కున చేర్చుకోవడానికి ఎలక్షన్ కంటే రెండు రోజుల మందే బిగ్ ప్లాన్ వేయనున్నారు. వారికి ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలో పెద్ద స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా రైతులు, వృద్ధులు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ సైలెంట్ ఓటర్ పై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. ఆ విషయాన్ని ఇతర పార్టీలు గ్రహించకముందే బీఆర్ఎస్ వారికి అండగా నిలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే వీరు బీఆర్ఎస్ చేసే ఆఫర్స్ కు లొంగుతారా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.