అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురించినందుకు వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ మీద కేసులు నమోదయ్యాయి. ఆయన కంపెనీల్లో హవాలా పెట్టుబడులు అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీబీఐ ఎంక్వైరీ చేసింది. చివరకు జగన్‌ను అరెస్టు చేసి సంవత్సరానికి పైగా జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఆ కేసులు సీబీఐ కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి జగన్ ఆస్తుల కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది.
ఏపీ సీఎం జగన్ కు కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ కోర్టు తాజాగా సీఎం జగన్ కేసులపై దర్యాప్తు జరిపింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది.
అంతకుముందు సీబీఐ చార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలని జగన్ కోరగా.. ఆయన వాదనను సీబీఐ-ఈడీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ స్పష్టం చేసింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది.
ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడుతామని చెబుతూ విచారణను ఈనెల 21కి ఈడీకోర్టు వాయిదా వేసింది.