
దేశంలో లాక్ డౌన్ ముగిస్తుండటంతో కేంద్రం కొత్తగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించింది. ఎక్కువగా కేసులు నమోదైన జిల్లాలు రెడ్ జోన్, తక్కువ కేసులు నమోదైన జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, అసలు కేసులు నమోదుకానీ జిల్లాలను గ్రీన్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో 6జిల్లాలు రెడ్ జోన్లలో, 18జిల్లాలు ఆరెంజ్ జోన్లలో, 9జిల్లాలు గ్రీన్ జోన్లు ఉన్నాయి. ఏపీలో 5జిల్లాలు రెడ్ జోన్లలో, 7జిల్లాలు ఆరెంజ్, ఒక జిల్లా గ్రీన్ జోన్లో ఉన్నాయి.
సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!
తెలంగాణలో..
రెడ్ జోన్లు(6): హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగ్ అర్బన్
ఆరెంజ్ జోన్లు(18): నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్లొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట్, మంచిర్యాల
గ్రీన్ జోన్లు(9): వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్.
మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ లో..
రెడ్ జోన్లు(5): కర్నూల్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
ఆరెంజ్ జోన్లు(7): తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ
గ్రీన్ జోన్లు(1): విజయనగరం