Raghunandan Rao: ఆంధ్ర ప్రదేశ్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు కెసిఆర్ నాలుగు వేల కోట్ల ప్రభుత్వ భూమి ఇచ్చాడా? అందుకు రిటర్న్ గిఫ్ట్ గానే ఖమ్మం సభకు సంబంధించి కొంత ఖర్చు భరిస్తున్నాడా? మిగతా రాష్ట్రాల్లో నిర్వహించే సభల ఖర్చును కూడా తానే మీద వేసుకుంటున్నాడా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు . ఖమ్మంలో తొలి ఆవిర్భావ సభ జరుపుకుంటున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులపై, ముఖ్యంగా కేసీఆర్ పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్ హఫీజ్ పేట పరిధిలోని సర్వేనెంబర్ 78లో ఓ జువెలరీ సంస్థ వ్యాపారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దాఖలు చేశారు.. ఇదే సర్వే నెంబర్ లో చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ మాత్రం దాఖలు చేయలేదు.. తోట చంద్రశేఖర్ 40 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్న రఘునందన్ రావు… ఒక సర్వే నెంబర్ లోని ఎనిమిది ఎకరాలపై ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం న్యాయమైనప్పుడు, అదే సర్వే నెంబర్ లోని 40 ఎకరాలపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.. కెసిఆర్ కు నిన్నటి దాకా దొంగల్లా కనిపించిన ఆంధ్ర ప్రాంత వాసులు ఇప్పుడు ఎలా ఆప్తమిత్రులయ్యారని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్ర వాళ్ళు దొంగలంటూ నిన్నటిదాకా తిట్టిన కేసీఆర్, ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఆ ప్రాంత రియల్టర్ అమ్ముకుంటుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.. మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ల అవకతవకలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనందుకు రంగారెడ్డి కలెక్టర్ ను ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదని రఘునందన్ రావు నిలదీశారు..
సోమేశ్ కుమార్ హయాంలో..
మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కనుసన్నల్లో భూ కుంభకోణాలకు తెర తీశారని రఘునందన్ రావు ఆరోపించారు.. హైదరాబాదు తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను తమకు నచ్చిన కంపెనీలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఆరు సంవత్సరాల కిందటే పథకం రచించింది అన్నారు.. ఇందుకు అనుగుణంగానే,కన్ ఫ ర్డ్ ఐఏఎస్ లను హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు కలెక్టర్లు గా నియమించిందని ఆరోపించారు.

బీహార్ మూలాలు ఉన్నాయి
కెసిఆర్ కు బీహార్ మూలాలు ఉన్నాయంటూ ఆంధ్ర ప్రాంత పెద్దలు కొంతమంది ఉద్యమ సమయంలో ప్రచారం చేశారని, బహుశా అందుకేనేమో బీహార్ కేడర్ అధికారులకు కీలక పోస్టులు కట్టబెడుతున్నారని రఘునందన్ రావు ద్వియబట్టారు వారసత్వం బీహార్ నుంచి వచ్చింది కాబట్టే తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చారా అని ఆయన ప్రశ్నించారు.. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ చీఫ్ సెక్రటరీగా కొనసాగిన సోమేష్ కుమార్ తీసుకొన్న నిర్ణయాలపై సమీక్ష చేయాలని రాష్ట్ర హైకోర్టును రఘునందన్ రావు అభ్యర్థించారు.. అయితే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల్లో కలకలం చెలరేగుతున్నది. మరోవైపు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివరాలు ఇవ్వాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు..