విశాఖపట్నం గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలకు జగన్ ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేసింది. ఈ మేరకు రూ. 30 కోట్లు విడుదల చేస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం ఈ పరిహారం అందజేసింది.
ఈ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, ఆస్పత్రుల్లో వెంటిలేటర్ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం, బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తున్నట్లు జగన్ ప్రకటించారు.