https://oktelugu.com/

2021 Roundup: చంద్రబాబును ‘కన్నీళ్లు’ పెట్టించింది

2021 Roundup: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి అంటే ఇదేనేమో. దాదాపు మూడు దశాబ్దాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల్లో పడింది. ఓటములనే పలకరిస్తూ కాలన్ని వెల్లదీస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా అపజయాలే పలకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అపర చాణుక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతం నీరుగారుతున్నాయి. అధికారం అందనంత దూరంలో ఉండి ఆశ పెడుతున్నా తీరడం లేదు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2021 12:47 pm
    Follow us on

    2021 Roundup: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి అంటే ఇదేనేమో. దాదాపు మూడు దశాబ్దాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల్లో పడింది. ఓటములనే పలకరిస్తూ కాలన్ని వెల్లదీస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా అపజయాలే పలకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అపర చాణుక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతం నీరుగారుతున్నాయి. అధికారం అందనంత దూరంలో ఉండి ఆశ పెడుతున్నా తీరడం లేదు. ఫలితంగా రాష్ర్టంలో విజయం ఎరుగని పార్టీగా రికార్డుకెక్కుతోంది.

    2021 Roundup

    Chandrababu

    వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడంతో బాబు అసెంబ్లీలో కన్నీటి పర్యంతమయ్యారు. తన సతీమణిని దూషించడం ఏమిటని ప్రశ్నించారు. ఇక నేను అసెంబ్లీకి రానని సీఎం అయిన తరువాతే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి మరీ సభ నుంచి బయటకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలపై అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ నేతల తీరుతో అందరిలో ఆగ్రహం పెరిగింది. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది.

    2021 సంవత్సరం టీడీపీకి అపజయాలే వెన్నంటి నడిచాయి. విజయం అనేది దరిదాపుల్లోనే కనిపించకుండా దోబూచులాడుతోంది. దీంతో చంద్రబాబు ఎన్ని ఉపాయాలు పన్నినా అవి వట్టివే అయిపోయాయి. ఫలితంగా విజయం వైసీపీకి సొంతం అయింది. అపఖ్యాతి టీడీపీ వశమైంది. దీంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బాబు ఏ మేరకు వ్యూహాలు రచిస్తారో కూడా తెలియడం లేదు. కానీ వైసీపీని ఎదుర్కొని టీడీపీ నిలవడం కొంచెం కష్టమేననే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.

    మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చెందింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఒకే ఒక మున్సిపాలిటీని గెలుచుకుంది. దీంతో వైసీపీ ముందు చతికిలపడింది. 11 కార్పొరేషన్లలో కనీసం బోణీ కూడా కొట్టలేదు. దీంతో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు టీడీపీని మరచిపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీకి ఎదురే లేకుండా పోతోంది. ఏ ఎన్నికలు వచ్చినా విజయం తమదేననే గర్వం వారిలో పెరుగుతోంది.

    తరువాత జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో తొలుత అభ్యర్థిని ప్రకటించినా తరువాత తప్పుకుంది. అయినా అక్కడ ఏకపక్షంగా సాగిన పోరులో వైసీపీనే విజయం సాధించింది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో కూడా టీడీపీ వెనుకబడిపోయింది. దీంతో ఏపీలో వైసీపీ ధాటికి టీడీపీ కుదేలైపోయింది. చంద్రబాబు ప్లాన్ లు సఫలీకృతం కాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పట్టు కోసం ఎదురు చూస్తోంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం సాధించకపోతే ఇక అంతే సంగతి అనే అభిప్రాయం అందరిలో నెలకొంది.

    Also Read: ఒకే సమయంలో విదేశీ పర్యటనల్లో చంద్రబాబు, రాహుల్ గాంధీ.. ఏంటి కథ.. ఏం జరుగుతోంది?

    స్థానిక ఎన్నికల్లో సైతం పార్టీ పాతాళానికి పడిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు టీడీపీని ఆదరించలేదు. దీంతో చంద్రబాబు డైలమాలో పడిపోయారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. టీడీపీని ఇంతలా దూరం పెడుతున్నారా అనే అనుమానాలు అందరిలో వచ్చాయి. కానీ టీడీపీలో ప్రక్షాళన జరగాలని నేతలు సూచిస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఫలితంగా చేదు ఫలితాలు చవిచూశారు. రాష్ర్టంలో టీడీపీకి జరిగిన నష్టం మామూలుది కాదు.

    మొత్తానికి 2021 టీడీపీకి పరాభవ సంవత్సరంగా మిగిలిపోతోంది. అన్ని ఎన్నికల్లోనూ ఓటమి సాధించి పార్టీ ప్రతిష్ట మసకబారింది. ప్రతిపక్షపార్టీగా కూడా తన విలువ నిలుపుకోలేకపోయింది. కనీవినీ ఎరగని రీతిలో కిందికి దిగిన టీడీపీ వైసీపీని టార్గెట్ చేసుకున్నా దాన్ని అడ్డుకోలేకపోయింది. దీంతో అన్ని ఎన్నికల్లోనూ అపజయాన్ని చవి చూసింది. ఏదిఏమైనా రాబోయే రోజుల్లోనైనా టీడీపీ మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

    Also Read: చంద్రబాబు రహస్య టూర్.. ఆ దేశానికి ఫ్యామిలీతో.. ఏంటీ కథ..?

    Tags