రెండు రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో జరిగిన బాలిక ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బాలిక తండ్రి చెప్పినవన్ని అబద్దాలే అని రుజువయ్యాయి. దీంతో పోలీసులు కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. అగనంపూడిలోని ఆదిత్య అపార్ట్ మెంట్ నాలుగో ఫ్లోర్ పై నుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో కీలక విషయాలు తెలిశాయి.

బాలిక ఆత్మహత్యపై తండ్రి అనుమానాలున్నాయని చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. తండ్రి అనుమానాల మేరకు అపార్ట్ మెంట్ లోని ఆరుగురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంతో ఇందులో వేరే విషయాలు బయటకు వచ్చాయి. బాలిక మృతికి వారికి ఏ సంబంధం లేదని తేలిపోయింది.
బాలిక ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించారు. కానీ చివరికి అతడే కారణమని తేలింది. బాలిక అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న దిగుమతి నరేష్ అనే యువకుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. పలుమార్లు కలుసుకుని తమ వాంఛ తీర్చుకునే వారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం శారీరకంగా కలుసుకున్న ఇద్దరిని బాలిక తండ్రి చూశాడు. దీంతో బాలిక పైకి వెళ్లి అక్కడి నుంచి దూకేసింది.
అపార్ట్ మెంట్లో పని చివరి రోజు కావడంతో కలుసుకుందామని బాలికను నగేస్ అర్థరాత్రి సమయంలో పైకి రావాలని కోరాడు. దీంతో ఆమె వెళ్లడంతో ఇద్దరు కలుసుకున్నారు. కూతురు కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన తండ్రి బాలికను ఆ విధంగా చూసి ఖంగుతిన్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి ఎక్కడ తిడతారోనని భయంతో పై నుంచి దూకేసినట్లు పోలీసుల పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారంలో పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తండ్రి కట్టుకథ అల్లాడు. కానీ పోలీసులు విచారణ చేపట్టే సరికి నిజాలు వెలుగు చూశాయి. వాస్తవాలు తెలియడంతో బాలిక ప్రియుడు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక భయంతోనే పై నుంచి దూకి చనిపోయిందని వెల్లడైంది.