
ప్రియాంకరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. సంచలనం రేకెత్తిస్తున్న ప్రియాంక రెడ్డి రేప్ మరియు మర్డర్ కేసులో జీర్ణించుకోలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె పై కామాంధులు చేసిన ఆఘాయిత్యం అతి దారుణం. పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డి, పశువులను హ్యాండిల్ చేయగలిగింది కానీ పశువుల వలె నలుగురు ఆమెపై అఘాయిత్యం చేస్తుంటే ప్రతిఘటించలేక, నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక ఆమె రోదన ఆ చిమ్మ చీకటిలో కలిసి పోయింది. ఆమె తనువు కానరాని లోకానికి వెళ్లిపోయింది.
ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. పోలీసులు స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.

