బురదలో ప్రపంచ రికార్డ్..ఉసేన్ బోల్డ్ కంటే వేగంగా..

జమైకా పరుగుల వీరుడు ‘ఉసేన్ బోల్డ్’ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ పరుగుల వీరుడుగా ఇప్పటి వరకు పరిగణించారు. కానీ కర్ణాటక కు చెందిన శ్రీనివాస గౌడ్, ‘బోల్డ్’ కంటే వేగంగా పరుగెడతాడు అనే విషయం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు, ఉడిపి ప్రాంతాలలో ఒక సంప్రదాయ పోటీ “కంబళ” నిర్వహించేవారు. ఈ పోటీలో దున్నలతో పాటు పరుగెత్తాలి. ఎవరైతే తక్కువ సమయంలో గమ్యాన్నిచేరుకుంటారో వారే విజేతలు. అయితే […]

Written By: Neelambaram, Updated On : February 15, 2020 1:12 pm
Follow us on

జమైకా పరుగుల వీరుడు ‘ఉసేన్ బోల్డ్’ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ పరుగుల వీరుడుగా ఇప్పటి వరకు పరిగణించారు. కానీ కర్ణాటక కు చెందిన శ్రీనివాస గౌడ్, ‘బోల్డ్’ కంటే వేగంగా పరుగెడతాడు అనే విషయం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరు, ఉడిపి ప్రాంతాలలో ఒక సంప్రదాయ పోటీ “కంబళ” నిర్వహించేవారు. ఈ పోటీలో దున్నలతో పాటు పరుగెత్తాలి. ఎవరైతే తక్కువ సమయంలో గమ్యాన్నిచేరుకుంటారో వారే విజేతలు. అయితే ఈ పోటీ మాములు నేల మీద జరగదు. బురదతో ఉన్న మళ్ళలో నిర్వహిస్తారు.

ఈ పోటీలలో శ్రీనివాస గౌడ్ అనే 28ఏళ్ళ కుర్రవాడు తన దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పరుగెత్తాడు అంటే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లల్లోనే పూర్తి చేసాడు. దీంతో ఇప్పటివరకు ఉసేన్ బోల్డ్ తో ఉన్న రికార్డ్ (100 మీ.) 9.58 సెకన్ల కంటే ఇది తక్కువే.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శ్రీనివాస్ గౌడ్ ఈ రికార్డ్ చేసింది బురదలో అదేమామూలు నేలపై అయితే సమయం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.