తెలంగాణలో తొలి కరోనా మృతి

తెలంగాణలో రాష్ట్రంలో కరోని నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 కరోనా పాజిటివ్ కేసులు కాగా ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. ఖైరాతాబాద్ లో కరోనాతో 74 ఏళ్ల వృద్ధుడు వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఈ వృద్ధుడు గ్లోబల్ ఆస్పత్రి లో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకున్నాడని.. అతడు చనిపోయాక కరోనా పాజిటివ్ […]

Written By: Neelambaram, Updated On : March 28, 2020 7:40 pm
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో కరోని నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 కరోనా పాజిటివ్ కేసులు కాగా ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. ఖైరాతాబాద్ లో కరోనాతో 74 ఏళ్ల వృద్ధుడు వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఈ వృద్ధుడు గ్లోబల్ ఆస్పత్రి లో ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకున్నాడని.. అతడు చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు.

శనివారం కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాధి సోకిందని చెప్పారు. అదేవిధంగా ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేసేవారికి కరోనా సోకిందని తెలిపారు. నాలుగు కుటుంబాలకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అలాగే ప్రగతి నగర్ లో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో చాలామందికి చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చిందన్నారు. వీరందరినీ త్వరలోనే వాళ్ల ఇళ్లకు పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయన కోరారు. అదేవిధంగా ప్రార్థన మందిరాలు, చర్చిలు, ఆలయాలు కరోనా వ్యాప్తికి కారణం కావద్దని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులుపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 933 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 20మంది మృతి చెందినట్లు సమాచారం.