https://oktelugu.com/

Laughing Buddha:  లాఫింగ్ బుద్ధాను ఇంట్లో అక్కడ పెడితే పట్టిందల్లా బంగారం.. ఏం చేయాలంటే?

Laughing Buddha: మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో లాఫింగ్ బుద్ధాను చూసి ఉంటారు. గుండ్రటి తలతో, బాన పొట్టతో, గుండ్రటి ముఖంతో కనిపించే లాఫింగ్ బుద్ధాను మనలో చాలామంది ఎంతో ఇష్టపడతారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరగడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది. అయితే ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఉంచే సమయంలో కొన్ని నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే తూర్పు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 18, 2022 / 03:51 PM IST
    Follow us on

    Laughing Buddha: మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో లాఫింగ్ బుద్ధాను చూసి ఉంటారు. గుండ్రటి తలతో, బాన పొట్టతో, గుండ్రటి ముఖంతో కనిపించే లాఫింగ్ బుద్ధాను మనలో చాలామంది ఎంతో ఇష్టపడతారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరగడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది. అయితే ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఉంచే సమయంలో కొన్ని నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

    Laughing Buddha

    ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధాను ఉంచితే మంచిది. ఇలా చేయడం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఆగిపోతాయి. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే అవకాశంతో పాటు ఇంట్లో డబ్బులకు కొరత ఉండదని గుర్తుంచుకోవాలి.

    Also Read: Nagababu: నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్నకానుకలు ఇవే !

    ఉద్యోగం వచ్చిన తర్వాత కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటే ప్రతి ఒక్కరూ నడిచే దారిలో లాఫింగ్ బుద్ధాను ఉంచాలి. ఇలా చేయడం వృత్తి జీవితం మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబంతో పాటు ఆఫీస్ లో కూడా సమస్యలు ఉంటే చేతులు పైకి ఉన్న లాఫింగ్ బుద్ధాను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. పిల్లలు పుట్టాలని అనుకుంటే మాత్రం నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధాను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

    అయితే బాత్ రూమ్ లేదా వంటగదికి సమీపంలో లాఫింగ్ బుద్ధాను ఉంచకూడదు. అలా చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

    Also Read: Sudheer -Rashmi : సుధీర్-రష్మీ ప్రేమ.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఇలా చూసి తీరాల్సిందే..