వర్షాకాలం జలచరాల్లో సంతానోత్పత్తి కాలం కావడంతో ఈ సమయంలో చేపలు లక్షల సంఖ్యలో గుడ్లు పెడతాయి. వర్షాకాలంలో చేపలు తింటే చేపల తర్వాత తరం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో సంతానోత్పత్తి వల్ల చేపలలో అనేక వ్యాధులు విజృంభించే అవకాశాలు ఉంటాయి. వీటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో కాలుష్య వ్యర్థాలు నదులలో కలిసిపోతాయి.
కాలుష్య వ్యర్థాలు నదులలో కలవడం వల్ల చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో జబ్బుపడిన చేపలు తింటే మీరు కూడా జబ్బు పడే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలంలో చేపలను తాజాగా ఉంచడానికి అనేక రసాల రసాయనాలను వినియోగించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఆహారంగా తినుబండారాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీములను తీసుకోకూడదు.
ఉడికించిన కూరలలో నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది. ఉప్పును తక్కువగా వాడటంతో పాటు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, స్నిగ్ధ పదార్థాలు తింటే మంచిది. వర్షాకాలంలో తాజా ఫలాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు వాటిలో శొంఠి, మిరియాల పొడి స్వల్పంగా తీసుకుంటే మంచిది.