Heart Attack Symptoms: ప్రస్తుతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. నిలకడ లేని ఆహార అలవాట్లు పలు రోగాలకు దారి తీస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి వ్యాధులకు దగ్గరవుతున్నాం. పాతికేళ్లకే పలు రోగాలు రావడంతో జీవితాంతం మందులు వేసుకోవాల్సిన పరిస్థితి. మందులు వేసుకోకపోతే రోగం తగ్గదు. రోగం తగ్గకపోతే సమస్యలు వస్తాయి. అందుకే మందులతోనే సహవాసం చేయాల్సి వస్తోంది. నివారణ చర్యలకు మాత్రం మొగ్గు చూపడం లేదు. దీంతో మందులు వేసుకుంటూ జీవితాలను నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
గుండె జబ్బు వస్తుందనే సంకేతాలు మనకు శరీరం ముందే అందిస్తుంది. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. మనం నిర్లక్ష్యంతో ఉంటే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అందుకే గుండెపోటు వస్తుందనే సంకేతాలు వచ్చిన వెంటనే మనం వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇలా అయితే గుండె జబ్బులను ముందే గమనించి ప్రమాదం నుంచి బయట పడొచ్చు.
గుండెపోటు వచ్చే ముందు శరీరం తీవ్రమైన అలసటకు గురవుతుంది. దవడ, మెడ, జీర్ణ సంబంధమైన నొప్పులు బాధిస్తాయి. చేతుల్లో నొప్పి, ఒత్తిడి తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే సరి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం మంచిది.
డయాబెటిస్, బీపీ ఉంటే కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. బీపీ కంట్రోల్ లో ఉండాలి. ఇలా గుండెపోటు బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే మన ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే.