Sugar Cane: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పు వస్తుంది. అప్పటి వరకు చల్లటి వాతావణం ఉండగా.. మార్చి నుంచి ఎండలు ప్రారంభమవుతాయి. 2024 ఏడాదిలో ఎండలు దంచి కొడుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో చల్లని పానీయాలు తాగేందుకు మక్కువ చూపిస్తున్నారు. వేసవిలో నేచురల్ గా లభించే పానీయాల్లో చెరుకు రసం ఒకటి. ఇది సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రం చెరుకు రసం అస్సలు తాగొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరు దీనిని తీసుకోవద్దంటే?
చెరుకురసంలో శక్తిని పెంచే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల దాహం తీరడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో కాల్షియం, కాపర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చెరుకురసం తాగడం వల్ల ఎముకలు గట్టిపడుతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణక్రియను సరిచేస్తుంది. రక్త హీనత సమస్యను నివారిస్తుంది.
చెరుకురసం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం దీనిని తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరిలో ప్రధానంగా మధుమేహం వ్యాధి ఉన్నవారు. డయాబెటీస్ వ్యాధి గ్రస్తులు చెరుకురసం తీసుకోవడం అంతమంచిది కాదని అంటున్నారు. చెరుకురసంలో గ్లైసెమిక్ ఇండిక్స్, గ్లైసెమిక్ లోడ్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. అందువల్ల దీనిని డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు దీనికి దూరంగా ఉండాలంటున్నారు.
దంతాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నవారు చెరుకు రసంకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అప్పటికే దంతాల సమస్య ఉన్నవారు చెరుకు రసం తీసుకుంటే బ్యాక్టీరియా మరింత అభిృద్ధి చెందుతుంది. దీంతో నోరు పెచ్చినట్లు అవుతుంది. ఉబకాయం ఉన్న వారు చెరుకు రసంకు దూరంగా ఉండాలి. చెరుకు రసంలో ఉండే ప్రోటీన్లు బరువు పెరగడానికి సహకరిస్తాయి. ఇందులో అత్యధికంగా కేలరీలు ఉండడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది. అందువల్ల వీరు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు వైద్యులు.