OverWeight: అధిక బరువు ఉండటం ఎప్పుడు సమస్యనే. ఇలా బరువు ఉండటం ఎవరికి నచ్చదు కూడా. అందుకే బరువు తగ్గేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పైకి తేలికగా కనిపించినప్పటికీ, చాలామందికి ఇది సాహసంలా కనిపిస్తుంది. కొందరు జిమ్, యోగా, డైట్, వర్కవుట్ వంటివి చేస్తూ సన్నగా మారడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు డైట్ పాటిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఓ రెండు కిలోలు మాత్రమే తగ్గుతారు. మరి మీ బరువు తగ్గాలి అంటే ఏం చేయాలో ఓ సారి చూడండి.
ఊబకాయం ఉంటే మధుమేహం, అధిక రక్తపోటు , కొలెస్ట్రాల్ వంటి సమస్యలను మరింత పెంచుతాయి. కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు వీలైనంత త్వరగా బరువు తగ్గడం మంచిది. అందుకే బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు తెలుసుకోవాలంటే ఈస్టోరీ ఫాలో అవండి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం సైడ్ ఎఫెక్ట్స్ కు గురికాకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి సహజ మార్గాల ద్వారా బరువు తగ్గడమే చాలా మంచిది అని గుర్తు పెట్టుకోండి.
బరువు తగ్గడానికి మొదటి అడుగు తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం. కొన్ని శక్తివంతమైన పానీయాలు తాగడం వల్ల మీరు తేలికగా బరువు తగ్గవచ్చు. అటువంటి పానీయమే ఆపిల్ సైడర్ వెనిగర్. గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 క్యాప్ఫుల్స్ యాపిల్ సైడర్ వెనిగర్ బాగా కలిపి తీసుకోవాలి. భోజనానికి 15 నిమిషాల ముందు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ డ్రింక్‌ను తరచుగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి.
బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా మీరు కేలరీలను తగ్గించవచ్చు, కొవ్వును కరిగించవచ్చు మరియు వేగంగా బరువు తగ్గవచ్చు. ఈ అద్భుతమైన పానీయం అనేక విధాలుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది అప్పుడప్పుడు ఆకలి బాధలను అరికడుతుంది. అనవసరమైన అనారోగ్యకరమైన ఆహారాన్ని నిరోధిస్తుంది. దీన్ని తాగడం వల్ల అదనపు కేలరీలు తీసుకోకుండా ఉంటాం.