Stress relief every 15 minutes tips: ప్రస్తుత రోజుల్లో వ్యాయామం చేయడం చాలా అవసరం. కానీ కొందరు వ్యాయామం అంటే సాదాసీదాగా నడుస్తూ పని ముగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమాత్రం ఆరోగ్యానికి సేఫ్ కాదని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం అనేది సాధారణంగా కాకుండా శరీరంలోని కేలరీలను ఖర్చు చేసే విధంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు వ్యాయామమును కాస్త కఠినంగా చేయడమే బెటర్ అని అంటున్నారు. ఈ కఠినమైన వ్యాయామంలో భాగంగా పరిగెత్తడం కూడా చాలా అవసరం అని అంటున్నారు. నడక కంటే పరిగెత్తడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు. అసలు రోజుకు ఎంతసేపు పరిగెత్తాలి? పరుగు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
వ్యాయామం అనేది శరీరంలోని రక్తప్రసరణ పెంచుతుంది. దీంతో రక్తనాళాల పనితీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. వీటితోపాటు శ్వాస వేగం కూడా పెరిగి శ్వాస నాళాల పనితీరు బాగుంటుంది. అయితే ఇది సాధారణ నడక కంటే వేగంగా నడవడం లేదా పరిగెత్తడం వల్ల అయితే మరింత తొందరగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. పరిగెత్తినప్పుడు శరీరంలో మొండెం, కాళ్లలోని భాగాలు అన్నీ కదులుతాయి. దీంతో ఇవి దృఢంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో శరీరంలో అన్ని అవయవాలు కదలిక ఏర్పడి రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు పరిగెత్తినా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా పరిగెత్తడం వల్ల మానసికంగా ఒత్తిడి తగ్గి అవకాశం ఉంటుంది. అలాగే ఏకాగ్రతను పెంచుతాయి. అప్పటివరకు ఉన్న మనసులోని ఆందోళన తగ్గిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యతో బాధే పడేవారు ప్రతిరోజు సాయంత్రం 15 నిమిషాలు పరిగెత్తినా కూడా రాత్రి హాయిగా నిద్ర పట్టి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనసు ఆందోళనగా ఉండి కాస్త విచారంగా అనిపించినా కూడా ఈ పరుగు ఎంతో ఉపకరిస్తుందని చెబుతున్నారు.
అయితే ఈ పరుగు అనేది స్వచ్ఛమైన వాతావరణంలో ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువగా పరిగెత్తే వారిలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. కానీ ప్రణాళికంగా పరుగులు పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నామని మరికొందరు చెబుతున్నారు.
ఏది ఏమైనా రోజు చేసే వ్యాయామంలో నడక కంటే పరిగెత్తడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.