Shanku Flower Plant: మారుతున్న కాలంతో పాటే కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బీపీ, షుగర్, క్యాన్సర్, మతిమరపు లాంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. శంఖుపూల మొక్క సహాయంతో ఈ అనారోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పూలతీగగా మనకు సుపరిచితమైన శంఖుపూల మొక్కను చాలామంది పశుగ్రాసంగా కూడా వినియోగిస్తారు.
ఆయుర్వేద వైద్యులు అనేక వ్యాధుల చికిత్సలో శంఖు పూల మొక్కను వాడతారు. దేవతారాధన కోసం కూడా ఈ తీగజాతి మొక్కను ఉపయోగించడం జరుగుతుంది. ఈ మొక్క యొక్క పూలను టీలో వేసుకుని తాగితే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెర్టిగో, బలహీనత, అజీర్తి, మలబద్ధకం, కామెర్లు, ఎమెసిస్ లాంటి సమస్యలకు శంఖుపూల మొక్కతో సులభంగా చెక్ పెట్టవచ్చు. శంఖు పూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడిని తీసుకోవడం ద్వారా మతిమరుపు రాదు.
శంఖుపూలు లేదా ఆకులను మరిగించిన కషాయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుండటంతో పాటు శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. శంఖు పూలు లేదా ఆకులతో మరిగించిన కషాయం తాగితే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఈ పూలతో తయారు చేసిన టీ తాగితే క్యాన్సర్ కణాల వ్యాప్తి ఆగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం సమస్యలకు సైతం ఈ పూలతో చేసిన టీ ద్వారా చెక్ పెట్టవచ్చు.
శంఖుపూల టీ తాగితే కఫ, వాత దోషాలు తొలగిపోతాయి. ఈ పూల టీని తాగితే కంటిచూపు మెరుగుపడటంతో పాటు రెటీనా దెబ్బ తినే అవకాశాలు అయితే తగ్గుతాయి. శంఖుపూల టీ వల్ల శుక్రకణాల శాతం పెరిగే అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు శంఖుపూల టీ తాగితే ఆకలిని నియంత్రించి బరువు తగ్గవచ్చు.