https://oktelugu.com/

Parenting: చలికాలంలో పిల్లలకు ఈ ఫుడ్ పెడితే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

శనగపిండితో తయారు చేసే లాప్సీని పిల్లలకు పెడితే వారి శరీరానికి వెచ్చగా తగులుతుంది. అలాగే జీర్ణ క్రియకు ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి ల్యాప్సీ రెసిపీ చేయడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 19, 2024 9:58 pm
Childrens

Childrens

Follow us on

Parenting: తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక్క క్షణం కూడా వాళ్లను వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకున్న సరే.. వాళ్లకి ఏదో ఒకటి అవుతుంది. పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే సీజన్ మారే కొలది పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో సాధారణంగా మనమే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అలాంటిది పిల్లలు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలు అయితే చెప్పక్కర్లేదు. వీరి చర్మం చాలా లేతగా ఉంటుంది. చలికి, వేడికి అంతగా తట్టుకోలేరు. కాబట్టి ఈ సీజన్‌లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఆహార విషయంలో అయితే అసలు అజాగ్రత్తగా ఉండకూడదు. చలికాలంలో పిల్లలకు పెట్టే ఫుడ్ బట్టి వారు చలికి తట్టుకోగలరు. శనగపిండితో తయారు చేసే లాప్సీని పిల్లలకు పెడితే వారి శరీరానికి వెచ్చగా తగులుతుంది. అలాగే జీర్ణ క్రియకు ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి ల్యాప్సీ రెసిపీ చేయడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.

పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడే ల్యాప్సీ రెసిపీని తయారు చేయాలంటే టేబుల్ స్పూన్ నెయ్యి, శనగ పిండి, బెల్లం, చిటికెడు రాక్ సాల్ట్, యాలకుల పొడి తీసుకోవాలి. ముందుగా గ్యాస్‌పై పాన్ ఉంచాలి. ఆ తర్వాత అందులో నెయ్యి వేసి.. శనగపిండి వేసి వేయించాలి. శనగపిండి రంగు మారే వరకు దాన్ని వేయించాలి. ఇలా వేయించిన తర్వాత అందులో బెల్లం వేయాలి. ఈ రెండు బాగా కలిసిన తర్వాత కొద్దిగా నీరు వేస్తూ కలపాలి. ఆ మిశ్రమానికి సరిపడా నీరు వేస్తూ లాప్సీ రెసిపీని కలపాలి. చివరిగా ఉప్పు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ ల్యాప్సీ బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని పిల్లలకు పెట్టాలి.

ఇలా రోజూ తయారు చేసి పిల్లలకు పెట్టడం వల్ల వారు చలికాలంలో ఆరోగ్యంగా ఉంటారు. విపరీతమైన చలిని కూడా పిల్లలు తట్టుకుంటారు. అయితే మీ పిల్లలు తినే తీపి బట్టి చేసుకోవాలి. ఎక్కువ తీపిగా చేయకూడదు. దీన్ని పంచదారతో కూడా చేయవచ్చు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పిల్లలకు చేసే ఏ పదార్థం అయిన బెల్లంతో చేయడమే అలవాటు చేయండి. శనగ పిండి, బెల్లంలో ఉండే పోషకాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. బెల్లంలోని పోషకాలు శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల చలికాలంలో పిల్లల శరీరం వెచ్చగా ఉంటుంది. అయితే రోజూ పిల్లలకు ఈ పదార్థం చేసి ఇవ్వకపోయిన కూడా కనీసం వారానికి ఒకటి నుంచి రెండు సార్లు అయిన చేసి ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.