Nails Health: సాధారణంగా మనకు జలుబు వస్తే గొంతులో దురద పెడుతుంది. ఆ తర్వాత ముక్కులో మంట ఏర్పడుతుంది. ఆ తర్వాత జలుబు మొదలవుతుంది. జలుబు తర్వాత దగ్గు, జ్వరం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. గొంతులో మంట ఏర్పడినప్పుడే జాగ్రత్త పడితే జలుబుతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇలానే ఏవైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే మన దేహం రకరకాల సంకేతాలు ఇస్తుంది. అందులో ప్రముఖమైనవి గోళ్లల్లో మార్పులు. అయితే ఈ మార్పులను అంత సులభంగా విస్మరించకూడదని వైద్యులు చెప్తున్నారు.
గోళ్ల పై గుండ్రని గీతలు
గోళ్ల పై గుండ్రని గీతలు లేదా డిప్రెషన్ లు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. దీనిని వైద్య పరిభాషలో నెయిల్ పిట్టింగ్ అంటారు. ఇది సోరియాసిస్, ఎగ్జిమా, ఇతర చర్మ సంబంధిత సమస్యలకు సంకేతం..నెయిల్ ఫిట్టింగ్ జట్టు రాలడానికి కారణమయ్యే ఆటో ఇమ్యూన్ వ్యాధికి సంకేతం.
నెయిల్ క్లబ్బింగ్
గోర్లు వంగి ఉన్నప్పుడు.. క్లబ్బింగ్ జరుగుతుంది. ఏళ్లకు ఏళ్ళు ఇలానే జరుగుతుంటే అనుమానించాలి. రక్తంలో తక్కువ ఆక్సిజన్, ఊపిరి తిత్తుల వ్యాధి, గుండె సమస్యలు, లివర్ సిరోసిస్, జీర్ణాశయ సమస్యలు ఉన్న వారి గోళ్లల్లో ఇలాంటి మార్పులు కనిపిస్తాయి.
చెంచా గోర్లు
కొందరిలో చేతి గోర్లు చెంచాల మాదిరిగా వంగి ఉంటాయి.. ఇవి చూడ్డానికి చాలా విచిత్రంగా కనిపిస్తాయి. అలా ఉండడం
ఇనుము లోపం, హిమోక్రొమాటోసీస్(కాలేయ సంబంధిత వ్యాధి) వ్యాధులకు సంకేతం.
టెర్రిస్ నెయిల్స్
గోరు పై భాగంలో ఎరుపు లేదా గులాబీ రంగు కొంతవరకు ఉంది.. మిగతాది మొత్తం తెల్లగా ఉంటే దానిని టెర్రి నెయిల్ అని పిలుస్తారు.. వృద్ధాప్యం వల్ల గోర్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కాలేయ సమస్యలు, రక్తప్రసరణ ఆగిపోవడం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహంతో బాధపడుతున్న వారి గోర్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. గోర్లలో గాయాలు కావడం, అనారోగ్యం ఏర్పడటం, గోరు పెరుగుదల తాత్కాలికంగా నిలిచిపోయినప్పుడు ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం నియంత్రణకు గురికాక పోవడం, రక్తనాళాలలో ప్రవాహం తగ్గినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వైద్య పరిభాషలో పెరిఫెరల్ ఆర్టరి డిసీజ్ అంటారు. స్కార్లెట్ ఫీవర్, మీజిల్స్, గవద బిళ్ళలు, న్యూమోనియా వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు గోర్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. రెటి నోయిడ్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేయించుకుంటున్న వారిలో గోర్లలోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వదులైన గోర్లు
కొందరిలో వేలి గోళ్లు వదులుగా కనిపిస్తుంటాయి.. గోరు చివరి భాగం తెలుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దానిని ఒని కోలీసిస్ అని పిలుస్తుంటారు. గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ లేదా సోరియాసిస్, దురద, దద్దుర్ల వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారి గోర్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పసుపు రంగు సిండ్రోమ్
దీనిని ఎల్లో నెయిల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇలాంటి వారిలో గోర్లు చిక్కగా, నెమ్మదిగా పెరుగుతాయి. రమేపి పసుపు రంగులో మారుతాయి. గోర్లలో క్యూటికల్ లేకపోవడం వల్ల ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా బ్రో న్కైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధిలో బాధపడుతున్న వారి గోర్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. లింఫెడెమా(చేతులు, పాదాలవాపు) వ్యాధితో బాధపడుతున్న వారి గోర్లలోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతి గోర్ల పైన నిలువుగా చిన్న గుంతలు పడితే కంగారు పడాల్సిన అవసరం లేదు.
గమనిక (Disclaimer)
ఇందులోని సమాచారం మా సొంత వైద్య నిపుణులు ఇచ్చింది కాదు. పాఠకులకు authentic ఆరోగ్య సలహాలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ సమాచారం Mayo clinic website నుంచి తీసుకున్నాం. అయినా కూడా, ఆయా సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని OkTelugu.com ద్వారా విన్నవిస్తున్నాం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nails health you can tell how your health is by looking at your nails
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com