
దేశంలో గత కొన్ని నెలలుగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కరోనా బారిన పడితే వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడేవాళ్లు, తగిన సమయంలో చికిత్స తీసుకోని వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. అయితే కరోనా కంటే టీబీనే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. దగ్గు తీవ్రతను బట్టి సులభంగా దగ్గు సాధారణ దగ్గో కాదో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: అలర్జీతో బాధ పడుతున్నారా.. ఆ కరోనా వ్యాక్సిన్లే తీసుకోవాలంట..!
అయితే టీబీ వల్ల ఎక్కువమంది చనిపోవడానికి ప్రధాన కారణం చాలామంది ఆలస్యంగా ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తున్నారు. ఆలస్యంగా గుర్తించడం వల్ల వ్యాధిని నయం చేయడం సాధ్యం కావడం లేదు. ఇప్పటికే టీబీకి వ్యాక్సిన్, మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన సమయంలో గుర్తిస్తే మాత్రమే టీబీకి సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. భారత్ లో రోజుకు 1200 మంది టీబీ వల్ల మరణిస్తున్నారంటే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో సులభంగానే అర్థమవుతుంది.
Also Read: ఆ లక్షణాలు ఉంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదా..?
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో ఇప్పటికీ ప్రభావవంతంగా పని చేసే మందులు లేవు. వ్యాధి లక్షణాలను బట్టే వైద్య నిపుణులు రోగులకు మందులను ఇస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ జరగాల్సి ఉంది. టీబీ మొదట లంగ్స్ కు వ్యాపించి ఆ తరువాత ఇతర అవయవాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. మందుల లభ్యత తక్కువగా ఉండటం టీబీ బాధితుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
చాలామంది దగ్గు వస్తే కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు కానీ టీబీ అయ్యే అవకాశం ఉందని అనుకోవడం లేదు. ఫలితంగా రోగులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. సకాలంలో టీబీ వ్యాధిని గుర్తిస్తే సరైన సమయంలో చికిత్స త్వరగా తీసుకోవడంతో పాటు కోలుకునే అవకాశం ఉంటుంది.