Site icon OkTelugu

Midnight Hunger: అర్ధరాత్రి ఆకలి.. కారణమేంటి? ఏం చేయాలి?

Midnight Hunger

Midnight Hunger

Midnight Hunger: ఆహారంపై చాలామందికి అనేక అలవాట్లు ఉంటాయి. కొందరు రాత్రి సమయంలో లైట్ ఫుడ్ తీసుకుంటే మరికొందరు భోజనం చేసి నిద్రిస్తారు. అయినా కూడా మళ్లీ నిజం చేసే సమయంలో కొంతమందికి ఆకలి వేస్తుంది. ప్రస్తుత రోజుల్లో చాలామందిలో ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇలా రాత్రిళ్ళు ఆకలి వేసినప్పుడు కొంతమంది కడుపు నింపుకోవడానికి జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. కానీ ఇలా అర్ధరాత్రి ఆకలి వేయడం వల్ల జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. ఇది తాత్కాలికంగా ఆకలిని తగ్గించినా.. ఆ తర్వాత అనేక ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

రాత్రి సమయంలో డిన్నర్ చేసిన తర్వాత అర్ధరాత్రి మళ్లీ ఆకలి కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాత్రి తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ కావడమే. అంతేకాకుండా ప్రోటీన్, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమై మళ్ళీ ఆకలి వేస్తుంది. ఇలా ఆకలి వేసినప్పుడు మానసికంగా ఒత్తిడితో గురవుతారు. నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. కొంతమంది నిపుణుల సూచనల ప్రకారం రాత్రి భోజనంలో ప్రోటీన్, ఫైబర్, స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. వీటిలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమ చపాతీలు, రాగిసంకటి, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవడం వల్ల ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటాయి. ఫలితంగా అర్ధరాత్రి ఆకలి వేయకుండా ఉంటుంది.

అయితే అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇలాంటి వాటిలో పెరుగన్నం తినొచ్చు. లేదా బాదం, వాల్ నట్స్, పల్లీలు వంటివి తీసుకోవడం వల్ల ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవే కాకుండా నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగితే ఆకలి తగ్గడమే కాకుండా శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. ఇందులో ఉండే ట్రిప్టోపాన్ మంచి నిద్రకు సహకరిస్తుంది. అయితే అర్ధరాత్రి ఆహారానికి బదులు కేకులు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కేలరీలు ఎక్కువగా చేరి కొవ్వు పెరిగే అవకాశం కూడా ఉంది. పైగా రక్తంలో చక్కెర నిల్వలు ఒక్కసారిగా పెరిగి మళ్ళీ పడిపోతూ ఉంటాయి. అయితే కేలరీలు ఎక్కువగా తీసుకోకూడదు అనుకునేవారు రాత్రి నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం చేయాలి. తగినంత నీరుని తీసుకోవాలి. కాఫీ, టీ తగ్గించాలి.

అర్ధరాత్రి ఆకలి వేయడం హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితి పదేపదే ఎదురైతే వైద్యులను సంప్రదించడం మేలు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Exit mobile version