Pregnancy delayed: కెరీర్ కోసం.. కొన్ని రోజులు సంతోషంగా ఉండడం కోసం.. కొంతమంది సంతానంను వాయిదా వేస్తుంటారు. ఇంకొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకొని సంతానం కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ నిర్ణయిత వయసు దాటిన తర్వాత చాలామందిలో సంతానలేమి సమస్యలు ఉంటున్నాయి. వీటి పరిష్కారం కోసం చాలామంది ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆలస్యంగా సంతానం అయితే పిల్లల పెంపకంలో ఇబ్బందులు ఉంటాయన్న విషయం ఇప్పటివరకు చాలామందికి తెలుసు. అంతేకాకుండా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు కూడా ఉంటున్నాయి. అయితే లేటెస్ట్ గా ఆలస్యంగా సంతానం అయినవారి పిల్లల్లో ‘డౌన్ సిండ్రోమ్ రిస్క్’ఉంటున్నట్లు గుర్తించారు. ఇది పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే?
ఇటీవల ప్రచురించిన నివేదికల ప్రకారం సంతానం ఆలస్యం అయితే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ రిస్క్ పెరుగుతున్నట్లు తేలింది. మహిళలు 25 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ప్రతి 1250 మందిలో ఒకరికి.. 30 ఏళ్లలో అయితే 1000 మందిలో ఒకరికి.. 35 ఏళ్లలో అయితే 400 మందిలో ఒకరికి.. 45 ఏళ్లలో అయితే 100 మందిలో ఒకరికి.. 45 ఏళ్లలో అయితే 30 మందిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉంటున్నట్లు గుర్తించారు. డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది జన్యుపరమైన పరిస్థితి. సాధారణ మనుషుల్లో ప్రతి కణంలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రం రిస్క్ ఉన్నవారిలో 21 క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. వయసు పెరిగే మహిళల్లో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇది ఎక్కువగా మహిళల అండంలో పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. దీనిని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా తల్లి రక్తంలో క్రోమోజోముల ద్వారా గుర్తిస్తారు. అయితే ఇది రిస్కు లెవెల్స్ మాత్రమే సూచిస్తుంది. ఆ తర్వాత Amniocentesis పరీక్ష చేసి 11 నుంచి 14 వారాల్లో తేలుస్తారు.
డౌన్ సిండ్రోమ్ రిస్క్ ఉన్న పిల్లల్లో మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. మీరు ఇతర పిల్లలు లాగా చలాకీగా ఉండలేరు. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించలేరు. అలాగే వీరి అవయవాలు మిగతా వారి కంటే ప్రత్యేకంగా ఉంటాయి. వీరు మాటలు నేర్చుకోవడం.. నడవడం.. వంటివి ఆలస్యంగా చేస్తారు. కొన్నిసార్లు హృదయ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే వయసు పైబడిన వారు గర్భం దాల్చితే ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పుట్టిన బిడ్డకు డౌన్ సిండ్రం నిర్ధారణ అయితే ముందుగానే వారికి ప్రత్యేకంగా స్పీచ్ తెరపి.. ప్రత్యేక విద్య.. ఫిజియోథెరపీ వంటివి చేసి మిగతా పిల్లలతో సమానంగా ఉంచాలి.