Hair Care: ఈ మధ్య కాలంలో చాలామంది జుట్టు తెల్లబడటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. తెల్లగా మారిన జుట్టును కొంతమంది మానసిక సమస్యగా భావిస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా జుట్టు తెల్లబడకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది. వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా జుట్టు మరింత తెల్లబడకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ వల్ల జన్యుపరమైన సమస్యల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.
జుట్టు కోసం హెయిర్ కలర్స్ ను వాడేవాళ్లు తరచూ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఆముదం, కొబ్బరి నూనెను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆహారంలో కరివేపాకును చేర్చుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కరివేపాకులో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.
కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు ఉన్నాయి. జుట్టుకు కరివేపాకు పేస్ట్ ను పట్టించడం ద్వారా కూడా జుట్టు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.