Sleeping Tips: ప్రతి మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు టైం ప్రకారం నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కనీసం 7 గంటల పాటు నిద్రించాలని పలువురు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అయితే కొంత మంది రోజంతా నిద్రపోయినా మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకు వారు సరైన భంగిమలో నిద్రపోకుండా ఉండడమే. ముఖ్యంగా బొర్లా పడుకున్న వారు ఎంతసేపు నిద్రపోయినా ఫలితం ఉండదు. ఇంతకీ ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర పోయినట్లు అవుతుంది? బొర్లా పడుకుంటే వచ్చే సమస్యలేంటి?
రాత్రి భోజనం చేసిన తరువాత ప్రతి ఒక్కరికి కంటినిండా నిద్ర వస్తుంది. కొందరు తిన్న తరువాత కాసేపు ఉండి ఆ తరువాత నిద్రిస్తారు. మరికొందరు తిన్న వెంటనే నిద్రపోతారు. ఇలా వెంటనే నిద్రపోయే వారు వెల్లకిలా పడుకుంటారు. అయితే వెల్లకిలా పడుకునేవారిలో మెడ, కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా యువత ఇలా పడుకోవడం వల్ల వారిలో ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే గురక పెట్టేవారు మాత్రం ఇలా నిద్రించడం వల్ల వారిలో శ్వాస సమస్యలు రావొచ్చు.
కొందరు ఎడమవైపు పడుకుంటారు. ఎడమ వైపు పడుకోవడం చాలా మంచిది. పెద్ద ప్రేగు ఎడమ వైపు ఉంటుంది. దీంతో ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. గర్భిణులను సైతం ఎడమవైపు పడుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇలా నిద్రించడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. కుడివైపు పడుకోవడం వల్ల ఛాతిపై ప్రభావం పడుతుంది. దీంతో గుండె సమస్యలు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయింటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు కుడివైపు పడుకోకుండా ఉండడమే మంచిది.
ఇక గురక పెట్టేవారు, కంపోర్టు లేనివారి బొర్లా పడుకుంటారు. ఇలా నిద్రించేవారికి తాత్కాలికంగా హాయిగా ఉంటుంది. కానీ దీర్ఘాకాలికంగా వీరిలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలా నిద్రించడం వల్ల శరీరలో ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతుంది. అలాగే ఇలా ఎక్కువగా నిద్రించేవారిలో వెన్నెముక వంగిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచంలో 47 శాతం మంది ఏదో ఒక పక్క ఒరిగి పడుకుంటారు. అయితే ఇలా పడుకున్నవారిలో యువత కంటే కంటే పెద్దవాళ్లలో ఎక్కువగా సమస్యలు వస్తాయి. వీరి కాళ్లల్లో రక్త ప్రసరణ తగ్గిపోయి, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. పెద్దవాళ్లు బొర్లా పడుకోకుండా ఉండడమే మంచిది.