
యువతులు, మహిళల్లో చాలామంది అవాంఛిత రోమాల సమస్య వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అవాంఛిత రోమాల సమస్యకు చెక్ పెట్టడం కోసం పార్లర్, స్పాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆధునిక పద్ధతుల ద్వారా అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తే కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా అవాంఛిత రోమాలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
అవాంఛిత రోమాలను తొలగించడానికి రేజర్ ను కాకుండా నీళ్లు, చక్కెర, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్నచోట ప్యాక్ లా రాయడం ద్వారా తక్కువ సమయంలోనే వెంట్రుకలను తొలగించుకునే అవకాశం ఉంటుంది. అవాంఛిత రోమాలను తొలగించడానికి త్రెడింగ్, షేవింగ్ ల కంటే వ్యాక్సింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే వ్యాక్సింగ్ సరిగ్గా చేయని పక్షంలో చర్మంపై పొక్కులు, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.
శనగపిండి, గంధం రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, రోజ్ వాటర్, ఆముదం, మీగడ ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని కొద్దిగా పసుపు కూడా కలిపి అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగివేస్తే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. ఎర్ర కందిపప్పును గ్రైండ్ చేసి అందులో గంధం, తేనె, ముల్తానీ మట్టి కలిపితే అవాంఛిత రోమాల పెరుగుదల వేగం నియంత్రించవచ్చు.
పచ్చి బొప్పాయి, కలబంద జెల్, పసుపు, శనగపిండి శరీరానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది. తేనె, నిమ్మరసం, చక్కెర మిశ్రమంతో కూడా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. గుడ్డు తెల్లసొనలో నిమ్మరసం కొన్ని చుక్కలు వేసి అవాంఛిత రోమాలు ఉన్నచోట రాయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.