మనలో చాలామంది తరచుగా జలుబు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. పెద్దవాళ్లతో పోల్చి చూస్తే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శీతాకాలం వచ్చిందంటే చాలు జలుబు సమస్య పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు చేస్తే రోజువారీ పనుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామంది జలుబును తగ్గించుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు.
Also Read: పాదాల పగుళ్లను మాయం చేసే ఇంటి చిట్కాలివే..?
అయితే ఎలాంటి మందులు అవసరం లేకుండా సులభంగా జలుబుకు చెక్ పెట్టవచ్చు. మన ఇంట్లో దొరికే సహజసిద్ధ పదార్థాలతో సులువుగా జలుబును తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల చాలామంది సాధారణ జలుబు వచ్చినా కంగారు పడుతున్నారు. గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే సులభంగా జలుబుకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. రోజూ రాత్రి సమయంలో పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తీసుకుంటే మంచిది.
Also Read: జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గించే వంటింటి చిట్కాలివే..?
పాలలో అల్లం, కుంకుమపువ్వు, జాజికాయ వేసి ఉడకబెట్టి ఆ మిశ్రమాన్ని సేవించినా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని పాలతో పాటు ఐదు నల్ల మిరియాలు తీసుకున్నా జలుబు తగ్గుతుంది. నీటిలో అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలిపి తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. తులసి ఆకులు, రాతి ఉప్పు మిశ్రమాన్ని నమిలి మింగినా జలుబు సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
గ్రీన్ టీ కూడా జలుబుకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని వైరస్, బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు చనిపోయే అవకాశాలు ఉంటాయి. పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నా జలుబు సమస్యకు చెక్ పెట్టవచ్చు.