Maca Root Powder Benefits: ప్రస్తుతం మగవారిలో సంతానోత్పత్తి తగ్గిపోతోంది. వంధత్వం పెరిగిపోతోంది. జంటలు సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. ఫలితంగా జనాభా తగ్గిపోయే సూచనలున్నాయి. వివాహం చేసుకుంటున్న చాలా జంటలు సంతానానికి దూరమవుతున్నారు. దీనికి కారణం మగవారిలో వీర్య కణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్ ) తగ్గిపోవడమేనని పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీనికి కూడా ఓ దివ్యమైన మందు ఉందని ఎంతమందికి తెలుసు. దీన్ని వాడితే కచ్చితంగా ఫలితం ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దీనికి భలే డిమాండ్ ఏర్పడిది.
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలోని ఆండీస్ పర్వతాల్లో మాకా జాతి మొక్క పెరుగుతుంది. దీని వేర్లు పొడి చేసుకుని తాగితే మగవారికి స్పెర్మ్ కౌంట్ పెరుగుతున్నట్లు చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వేల ఏళ్లుగా అక్కడ ఆహారం, వైద్యంలో వాడుతున్నారు. శృంగార సమస్యలు తగ్గించడంలో ఈ మొక్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని వేర్ల పొడికి డిమాండ్ పెరిగిపోతోంది. ఇందులో ఉండే ఫైబర్, అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటంతో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. దీని వేర్లు రకరకాల మందుల్లో వాడుతున్నారు.
కామోద్రేకాలను రగిలించడంలో మాకా వేర్ల పొడి బాగా పనిచేస్తుంది. ఇది ఓ వయాగ్రాగా పనిచేస్తుంది. ఇప్పుడు పెరూలోనే కాకుండా పలు దేశాల్లో దీన్ని పెంచుతున్నారు. చైనా, యునాన్, ప్రావిన్స్ లోని పర్వతాలపై సాగు చేస్తున్నారు. 45 మంది మహిళలపై రోజు 3 వేల మిల్లీ గ్రాముల చొప్పున ఈ వేర్ల పొడి 12 వారాల పాటు తాగితే వారిలో శృంగార కోరికలు పెరిగాయని చెబుతున్నారు. 2010లో 131 మందికి 6 నెలల పాటు ఈ పొడిని వాడితే వారిలో కూడా శృంగార వాంఛలు రగిలాయని తేలింది.
మగవారిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాకా వేర్ల పొడిని వాడితే వీర్య కణాల సంఖ్య పెరిగిందని పరిశోధనల్లో రుజువైంది. 2020లో జరిగిన ఓ సర్వేలో 69 మంది మగాళ్లకు రోజు రెండు గ్రాముల చొప్పున 12 వారాల పాటు మాకా వేర్ల పొడిని ఇవ్వడంతో వారిలో వీర్య కణాల సంఖ్య పెరిగిందని చూశారు. మాకా పొడి శక్తిని పెంచుతుంది. మూడ్ ను సరిచేస్తుంది. నిరాశ తగ్గిస్తుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని చెబుతున్నారు. కొంత మంది కూరల్లో ఈ పొడిని వాడుతున్నారు. క్యాప్సూల్స్ లేదా పొడి రూపంలో కూడా లభిస్తోంది. రోజు ఒకటి నుంచి మూడు గ్రాములు వాడుకోవచ్చు.