మనలో చాలామంది ప్రతిరోజూ ఏదో ఒక విధంగా నెయ్యిని తీసుకుంటూ ఉంటాం. నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చాలామంది నెయ్యి తింటే బరువు పెరుగుతామని భావిస్తారు. కానీ నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. నెయ్యిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుపడటంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నెయ్యి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ లభిస్తాయి.
Also Read: రాత్రిపూట చపాతీ మాత్రమే తినే వారికి షాకింగ్ న్యూస్..?
మనలో చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. అయితే నెయ్యిని తీసుకోవడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేస్తే కాళ్లనొప్పులు తగ్గుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పరగడుపున నెయ్యి తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్లు ఆ సమస్యలు దూరమవుతాయి. నెయ్యి తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారడంతో పాటు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
Also Read: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలా.. పాటించాల్సిన చిట్కాలివే..?
ఆకలి మందగించిన వారు నెయ్యిని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. నెయ్యి అల్సర్ సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం కాఫీ, టీ తాగడం కంటే నెయ్యిని తీసుకుంటే మంచిది. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఎ లభిస్తుంది. గర్భిణులు నెయ్యి తింటే నెయ్యి గర్భస్థ పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. కూరల్లో రసం, సాంబార్, పప్పులలో నెయ్యి వేస్తే మంచిది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి నెయ్యి సహాయపడుతుంది. ఎప్పుడైనా చేతికి గాయం అయితే వెంటనే చేతికి నెయ్యి రాస్తే మంచిది. నెయ్యి రాయడం వల్ల త్వరగా గాయం తగ్గే అవకాశం ఉంటుంది.