https://oktelugu.com/

బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం లేదా.. ఆ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?

మనలో చాలామంది ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆఫీస్ కు ఆలస్యం కావడం వల్లో, ఇతర కారణాల వల్లో బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు మాత్రం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. Also Read: జలుబు సులభంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 26, 2020 11:05 am
    Follow us on


    మనలో చాలామంది ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆఫీస్ కు ఆలస్యం కావడం వల్లో, ఇతర కారణాల వల్లో బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు మాత్రం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి అని సూచిస్తున్నారు.

    Also Read: జలుబు సులభంగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

    సాధారణంగా రాత్రి భోజనం చేసిన తరువాత దాదాపు 12 గంటల పాటు మనం నిద్రపోవడం వల్ల ఎలాంటి ఆహారం తీసుకోము. పోషకాలు, కేలరీలు, పిండి పదార్థాలు ఉంటే మాత్రమే మన శరీరం, మనసు యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే అల్పాహారం తీసుకుంటారో వారికి పోషకాలు, కేలరీలు, పిండి పదార్థాలు బ్రేక్ ఫాస్ట్ ద్వారా లభిస్తాయి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వాళ్లు నీరసంగా ఉండటం వల్ల పని చేయాలన్నా ఉత్సాహం రాదు.

    Also Read: ఒకే బ్లడ్ గ్రూప్ వాళ్లు పెళ్లి చేసుకుంటే పిల్లల్లో లోపాలా..?

    చాలామంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గుతామని భావిస్తూ ఉంటారు. అయితే పరిశోధకులు బ్రేక్ ఫాస్ట్ చేయని వాళ్లు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయని వాళ్లలో జీవక్రియ సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారిలో హైపర్ లెవెల్ టెన్షన్ పెరగడంతో పాటు వాళ్లు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు సైతం ఉంటాయి.

    మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

    బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల సులభంగా బరువును అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మెదడుకు గ్లూకోజ్ అందడంతో పాటు మెదడు చురుకుగా పని చేస్తుంది. మతిమరపు లాంటి సమస్యల బారిన పడే అవకాశాలు సైతం తగ్గుతాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు దూరం కావడంతో పాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.