Homeవార్త విశ్లేషణHealth Tips : కుర్చీలో కూర్చొని అదే పనిగా పనిచేస్తున్నారా?

Health Tips : కుర్చీలో కూర్చొని అదే పనిగా పనిచేస్తున్నారా?

Health Tips : వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? లేదంటే ఆఫీసులో పని చేస్తున్నారా? ఏది అయినా సరే పని చేసే వ్యక్తులు చాలా సేపు కంప్యూటర్లకు లేదా ల్యాప్‌టాప్ ముందు కూర్చోవాల్సిందే. ఎలా కూర్చున్నామో పట్టించుకునే వారు కూడా చాలా తక్కువేనండోయ్. పని చేశామా? మనీ సంపాదించామా? అని తెగ ఆరాటపడుతున్నారు కానీ కొంచెం అయినా ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఇష్టం వచ్చినట్టు కూర్చుంటే ఒకటి రెండు సార్లు కూర్చోవాలి. కానీ అదే పని చేస్తే మాత్రం పెద్ద ప్రమాదం అంటున్నారు నిపుణులు. వెన్నెముక నుంచి మెడ వరకు ప్రభావితం అవుతుంది.

నొప్పితో తట్టుకోలేక పోతున్నారా? అంతేకాదు కొందరు తట్టుకోలేక నడుం టింగు మంటుందుని.. బాబోయ్ అంటూ అరిచేవారిని చాలా మందిని చూస్తుంటాం. ఇలా పనిచేసే వారు తమ లైఫ్ మొత్తంలో 7709 రోజులు కూర్చుని పని చేస్తారని అంటున్నారు నిపుణులు. దీని కారణంగా, చాలా తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి. అందుకే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఇకనైన కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందే.

వెన్నునొప్పి: మీరు కూర్చున్న కూర్చీ మీకు సపోర్టుగా ఉందా? లేదా? దీని వల్ల మీ వెన్నుముకపై ప్రభావం పడుతుంది. నెమ్మదిగా వెన్నునొప్పి వస్తుంది. ఈ నొప్పి మెడ నుంచి మొదలై తోక ఎముక వరకు ఉంటుంది అంటున్నారు.

ఊబకాయం: అవును ఊబకాయం కూడా వస్తుంది. ఒకే భంగిమలో ఎక్కువసేపు కుర్చీపై కూర్చుని కదలకుండా గంటలు.. గంటలు అలా పని చేస్తే మీ శరీరంలోని దిగువ భాగం పెరగడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫ్యాట్ పెరిగి చాలా ఇబ్బంది అవుతుంది.

ఏకాగ్రత: మీరు గంటల తరబడి సరైన పద్దతిలో కుర్చీపై కూర్చొని గంటల తరబడి పని చేస్తుంటే మాత్రం కచ్చితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. అసౌకర్యంగా కూర్చోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. సరిగ్గా కూర్చోవడం అవసరం.

భుజం నొప్పి: గంటల తరబడి కూర్చొని వేళ్లతో కంప్యూటర్ ను నొక్కడం వల్ల చేతుల నుంచి భుజాల వరకు నొప్పి వస్తుంది.

రక్త ప్రసరణ తగ్గడం: గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుంటే రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. ఇలా కంటిన్యూగా కూర్చోవడం వల్ల భుజం, పొట్ట, నడుము భాగాల్లో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో శరీరంలో జలదరింపు లేదా తిమ్మిరి వంటి సమస్యలు వస్తుంటాయి.

సొల్యూష్: కంటిన్యూగా కూర్చొని ఒకే విధంగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త. కాసేపు లేచి నడవడం అవసరం. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. అటూఇటూ నడుస్తూ ఉండాలి. దీని వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular