Homeలైఫ్ స్టైల్Fast eating health effects: భోజనం నిమిషాల్లోనే తినేస్తున్నారా.. ఇది మీకోసమే..

Fast eating health effects: భోజనం నిమిషాల్లోనే తినేస్తున్నారా.. ఇది మీకోసమే..

Fast eating health effects: తినే తిండి మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఆహారంలో ఆకుకూరల నుంచి మొదలు పెడితే ప్రోటీన్స్ వరకు అన్నీ ఉండేలా చూసుకుంటారు. మరికొందరేమో ఆ సమయానికి ఒక ముద్ద తినేస్తే సరిపోతుంది అనుకుంటారు.. ఇంకొందరేమో తినే తిండిని అత్యంత వేగంగా ముగించేస్తారు.

ఆహారాన్ని సాధ్యమైనంతవరకు నమిలి మింగాలి. ఎక్కువసేపు తినాలి. అలాకాకుండా ఆబరాగా తినేస్తే ఇబ్బంది కలుగుతుంది. వేగంగా తినడం వల్ల ఆకలి తీరదు. పైగా ఆహారం మరింత ఎక్కువ తినాలనిపిస్తుంది. వేగంగా తినే క్రమంలో మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో అర్థం కాదు. దానివల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారం విపరీతంగా తిన్నప్పుడు శరీరం ఒకరకంగా మారిపోతుంది. బద్ధకం ఆవరిస్తుంది. అడుగులు వేయాలంటేనే ఇబ్బంది ఉంటుంది. దీంతో చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో ఆహారం తాలూకు కేలరీలు శరీరంలో నిల్వ ఉంటాయి. అవి ఖర్చు కాకుండా ఉండిపోవడంతో కొవ్వులుగా మారిపోతాయి. ఆ కొవ్వులు శరీరానికి హాని కలిగిస్తాయి.

ఇలాంటి హానికరమైన కొవ్వుల వల్ల టైప్ 2 డయాబెటిక్ సమస్య వస్తుంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఆహారాన్ని నమిలి మింగాలి. సాధ్యమైనంతవరకు వేగంగా ఆహారాన్ని తినడం కాకుండా.. నిదానంగా నమిలి మింగాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ నుంచి మొదలు పెడితే ప్రోటీన్ల వరకు అన్నీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మాంసాహారాన్ని తగ్గించాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలను.. గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి సమాన విధానంలో పోషకాలు అందుతాయి. ఆహారాన్ని నమిలి మింగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. శరీరంలో కేలరీలు పేరుకు పోవడానికి ఆస్కారం ఉండదు. ఆహారం తిన్న తర్వాత కాసేపు నడిస్తే అది త్వరగా జీర్ణం అవుతుంది. అప్పుడు కేలరీలు ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందువల్ల కొవ్వు నిల్వలు ఏర్పడవు.

వెనుకటి కాలంలో మన పెద్దలు ఆహారం తినగానే నడిచేవారు. ఏదైనా పనిలో నిమగ్నం అయ్యేవారు. ముఖ్యంగా మాంసాహారం తినడంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందువల్లే ఆహారాన్ని మితంగా తినాలి. నమిలి తినాలి. వేగానికంటే నిదానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.

గమనిక ..

ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యుల చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారాన్ని ఓకే తెలుగు తన పాఠకుల కోసం ఈ కథనాన్ని అందించింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ కథనం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అనే విషయాన్ని పాఠకులు గుర్తించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version