spot_img
Homeహెల్త్‌Summer Heatwave Remedies: ఎండ దంచి కొడుతోంది.. ఉక్క పోత పీల్చి పిప్పిచేస్తోంది.. మీ శరీరాన్ని...

Summer Heatwave Remedies: ఎండ దంచి కొడుతోంది.. ఉక్క పోత పీల్చి పిప్పిచేస్తోంది.. మీ శరీరాన్ని ఇలా కూల్ చేసుకోవాల్సిందే..

Summer Heatwave Remedies: ఎండ దంచి కొడుతున్నది. దీనికి తోడు ఉక్క పోత ఇబ్బంది పెడుతున్నది. బయట అడుగుపెడితే చాలు చెమట చిరాకు పెడుతోంది. ఒంట్లో నుంచి నీరు, లవణాలు పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. నీరసం ఆవహిస్తోంది. నిస్సత్తుగా ఇబ్బంది పెడుతోంది. ఇలాగే శరీరంలో నీరు తగ్గితే కచ్చితంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

ఎండాకాలంలో శరీరం నుంచి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి.. కచ్చితంగా దానిని భర్తీ చేయాలి. అలాగని శీతల పానీయాలు తాగకూడదు. సోడాల జోలికి వెళ్ళకూడదు. నీరు అధికంగా ఉన్న పండ్లు తీసుకోవాలి. కోల్పోతున్న నీటిని శరీరంలో భర్తీ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మట్టికుండలో నీటిని నిల్వ ఉంచి తాగడం వల్ల దాహార్తి తీరుతుంది. ప్రకృతి లో లభించిన మట్టి ద్వారా చేసిన కుండ కాబట్టి అందులో.. ఎటువంటి ప్రమాదకరమైన పదార్థాలు ఉండవు.

ఈ పానీయాలు తాగాల్సిందే

శరీరంలో లవణాల శాతం పెంచుకోవడానికి కొన్ని రకాలైన పానీయాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిని తాగితే శరీరం సత్తువతో ఉంటుంది. ముఖ్యంగా తుంగ ముస్తెలు, పర్పటకం, వట్టి వేళ్ళు, చందనం, సుగంధిపాల, సొంటి వంటి వాటిని రాత్రి కూడా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వేడి చేయాలి. అనంతరం వాటిని వడగట్టుకోవాలి. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరం లవణాలను పెంపొందించుకుంటుంది

పెరుగులో కాస్త చక్కెర, యాలకుల పొడి కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మధుమేహం.. ఇతర వ్యాధులు ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకోకపోవడమే మంచిది.

దానిమ్మ పండ్ల రసంలో పెరుగు మీద ఉండే తేట లేదా చిక్కటి పాలు, చక్కెర కలిపి తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న వేడి తగ్గుతూ ఉంటుంది.

దానిమ్మ పండు లో ఉన్న గింజలను రసంగా మార్చి.. అందులో బెల్లం, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాల పొడి కలిపి.. చల్లగా చేసుకుని సాయంత్రం పూట తాగవచ్చు. దీనివల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది.

మజ్జిగ పల్చగా చేసుకొని.. అందులో నిమ్మరసం పిండుకొని.. కొంతమేర మిర్యాల పొడి.. సైంధవ లవణం కలుపుకొని తాగితే.. కోల్పోయిన లవణాలను భర్తీ చేసుకోవచ్చు.

నిమ్మరసంలో కాస్త ఉప్పు.. కొంచెం చక్కెర కలుపుకొని తాగితే బాగుంటుంది. ఒకవేళ ఇందులో జీలకర్ర, యాలకుల పొడి కలిపి కూడా తాగవచ్చు.

మామిడి పండ్ల నుంచి గుజ్జును తీసి.. అందులో కాస్త చెక్కర కలిపి.. ఉడికించాలి. పానకం చేసుకొని.. అందులో సైంధవ లవణం, యాలకుల పొడి కలిపి నిల్వ చేసుకోవాలి. అప్పుడప్పుడు నీటిలో కలిపి తాగితే శరీరానికి మేలు చేస్తుంది.

ధనియాలను పడుకునే ముందు నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది.

గమనిక

ఈ కథనం వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించాం. ఇది వైద్యుల చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. దీనిని పాఠకులు గమనించాలని ఓకే తెలుగు కోరుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version