Pizza And Burgers: కొంతమంది ఇంట్లో భోజనం తక్కువ. బయట జంగ్ ఫుడ్ తినడం ఎక్కువ. అందులో మరీ ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పుడ్ తోనే మొత్తం కడుపు నింపుకుంటారు.. ఇంట్లో మంచి ఆహారాన్ని వదిలేసి మరీ ఇలాంటి ఆహారాలను తినేవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. పానీపూరీలు, చాట్ లు, పఫ్స్, కేకులు అంటూ ఇంట్లో నుంచి కాలు బయటపెడితే అందులోనూ ఫ్రెండ్స్ కలిస్తే ఇక కడుపుకు కుస్తీనే అన్న విధంగా ఉంటుంది. బిర్యానీల గురించి పక్కన పెడితే పిజ్జా బర్గర్ల ఫ్యాన్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మరీ ఇలాంటి ఫుడ్ ను ఎక్కువ తింటున్నారు. అయితే ప్రతిరోజు పిజ్జాలు, బర్గర్లు తింటే మీరు ఫుల్ రిస్క్ లో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.
పిజ్జాలు, బర్గర్లు బాగా టేస్టీ బాగుంటుంది కాబట్టి వీటికి ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టేస్టీగా ఉన్నాయని ప్రతి ఒక్క పదార్థాన్ని తింటే కచ్చితంగా అనారోగ్య బారిన పడాల్సిందే. వీటిలో అధికంగా కొవ్వులు, చక్కెర స్థాయిలు ఉంటాయి. వీటి కారణంగా హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుంది అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినే వాళ్ళల్లో ఆరోగ్యపరంగా చాలా మార్పులు వస్తాయట. అంతేకాదు శరీరం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
బర్గర్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఒకేసారి ఎక్కువ క్యాలరీలు ఉత్పత్తి జరిగి శరీరంలోని కణాల పైన ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. అందుకే ఈ పిజ్జాలు, బర్గర్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. బర్గర్ తినే వాళ్ళల్లో ఊబకాయం వస్తుందట. చాలామంది బర్గర్లలో రెడ్ మీట్ పెట్టి అమ్ముతూ ఉంటారు. దీన్ని తినడం వల్ల సంతృప్త కొవ్వులు శరీరంలో అధికంగా చేరుతాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా పెరిగిన చెడు కొలెస్ట్రాల్ లిపో ప్రోటీన్స్ స్థాయిలను పెంచుతుంది.
చిన్న వయసులోనే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి ఈ జంక్ ఫుడ్ లు. బర్గర్లు, పిజ్జాలు తినేవాళ్ళల్లో ఇన్సులిన్ నిరోధకత జరుగుతుంది. దీంతో వీరికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక తరచుగా పిజ్జాలు బర్గర్లు తినే అమ్మాయిలలో చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తుందట. మరికొందరిలో ఒబెసిటీ సమస్య తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ అలవాట్ల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. ప్రతిరోజు పిజ్జాలు, బర్గర్లు తినేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీంతో బీపీ టాబ్లెట్లను రోజు వాడాల్సి వస్తుంది.
దీర్ఘకాలంలో పిజ్జాలు, బర్గర్లు తినేవారి మూత్రపిండాలలో రాళ్లు కూడా వస్తాయట. ఇక ఎన్నో రకాల వ్యాధులకు ఇవి కారణంగా మారుతాయి అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో రోగాల బారినపడే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యానికి హాని కలిగించే పిజ్జాలు, బర్గర్లను తినకుండా ఇంటి ఆహారాన్ని మాత్రమే ఫ్రిఫర్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇంట్లో తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు మీకు చాలా మేలు చేస్తాయి. ఇక విత్తనాలు, మొలకలు వంటివి మరింత మంచి చేస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కానీ తెలిసి తెలిసి చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారంతోనే చాలా రోజులను గడిపేస్తున్నారు. ఫ్రెండ్స్, పార్టీలు, అంటూ లేదంటే మీట్ లు అంటూ కలిస్తే చాలు కచ్చితంగా బయటకు వెళ్లి ఇలాంటి ఆహారాలను తింటున్నారు. ఇదిలా ఉంటే మరీ ముఖ్యంగా ఇంట్లోనే ఆర్డర్ చేసే అవకాశం ఉండటంతో స్వీగ్గీ, జొమాటోలలో ఆర్డర్ లు పెట్టేస్తున్నారు. తినాలి అనిపించిన వెంటనే ఆర్డర్ లు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి వీటి అలవాటు మరింత పెరిగుతుంది. సో ఆరోగ్యం జాగ్రత్త.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More