Basil : హిందూ ధర్మంలో తులసికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు తులసికి పూజ చేయనిదే ఏ పని ప్రారంభించరు. అంతటి మహత్తర శక్తిగల తులసి గురించి మనకు కొన్ని విషయాలు తెలియవు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా చెబుతారు. ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఆయుర్వేదంలో కూడా తులసికి ఎంతో విలువ ఇస్తారు. దీన్ని పలు మందుల్లో కూడా ఉపయోగిస్తారు. తులసిని ఎలా పూజించాలి? ఏ రోజు పూజించాలి? తదితర విషయాలపై మనం అవగాహన పెంచుకోవడం మంచిది. లేకపోతే మనం తప్పుడు పనులు చేస్తే మనకు ప్రతికూల ప్రభావాలే రావడం సహజం.
తులసికి ఏ రోజుల్లో..
వాస్తు ప్రకారం తులసికి ఏ రోజుల్లో నీళ్లు పోయకూడదో తెలుసుకోవాలి. ప్రతి ఆదివారం, ఏకాదశి, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం మంచిది కాదు. సూర్యాస్తమయం సమయంలో తులసి ఆకులను తెంచకూడదు. అలా చేస్తే నష్టాలు వస్తాయి. గురువారం తులసి మొక్కకు పచ్చి పాలు పోసి, ఆదివారం క్రమం తప్పకుండా సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. ఇలా మనం నిబంధనలు పాటించి క్రమం తప్పకుండా పాటిస్తేనే మనకు శుభాలు కలుగుతాయి.
అలాంటి మొక్కను..
ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోకూడదు. ఒకవేళ అలా ఉంచుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇది అశుభంగా భావిస్తారు. అలాంటి మొక్క ఉంటే దాన్ని తీసి బావిలో లేదా పవిత్ర స్థలంలో ఉంచి కొత్త మొక్కను నాటాలి. దీని వల్ల మనకు ఇంట్లో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తులసి విషయంలో ఇలాంటి పరిహారాలు పాటిస్తేనే ప్రయోజనం కలుగుతుంది. అంతేకాని మనకు తెలియనివి పాటించి అనర్థాలు తెచ్చుకోకూడదు. తులసిని ఎలా పూజించాలో తెలుసుకుని ప్రవర్తిస్తే మనకు లాభాలు వస్తాయి.
తులసిలో ఏముంటాయి?
తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటిని దూరం చేయడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు చేసినప్పుడు తులసి ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. బోఫాల్ లో గ్యాస్ లీకేజీ సమయంలో తులసి చెట్టు ఉన్న ఇళ్లల్లో ఉన్న వారికి ఎలాంటి నష్టాలు రాలేదట. అంటే తులసిలో ఉండే ఔషధాల గురించి రకరకాల పరిశోధనలు జరిగాయి. ఇలా తులసిలో ఉండే సహజ గుణాలతో అది మనకు ఎంతగానో తోడ్పడుతుంది. దీంతో తులసిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. కాకపోతే దాన్ని ఎలా పూజించాలో తెలుసుకుంటే మనకు మంచి జరిగేందకు ఆస్కారం ఉంటుంది.