Constipation: ఇటీవల కాలంలో మన ఆహార శైలికి అనేక రోగాలు వ్యాపిస్తున్నాయి. మనం తీసుకుంటున్న ఆహారాలే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఫలితంగా వ్యాధులు అంటుకుంటున్నాయి. అరవై ఏళ్లకు రావాల్సిన రోగాలు ఇరవై ఏళ్లకే వస్తున్నాయి. దీంతో మందులతోనే కాలం నెట్టుకు రావాల్సి వస్తోంది. బిల్ల వేసుకుంటేనే పని జరుగుతుంది. లేదంటే ఇబ్బందులే. వీటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం జాగ్రత్తలు పాటిస్తే ఎంతటి రోగాన్ని అయినా నియంత్రించవచ్చు. ఆ దిశగా మనం ప్రయత్నించడం లేదు. ఏదో మందులు వేసుకోవడం పని కానిచ్చేయడం అలవాటుగా మార్చుకుంటున్నాం. కానీ దాని మూలాలు గ్రహించి దాన్ని నాశనం చేయాలనే ఆలోచన మనకు పుట్టడం లేదు.

ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అది సాఫీగా జరగాలని మాత్రలు వాడుతున్నారు. మాత్ర వేసుకోవడం దొడ్లోకి వెళ్లడం ఓ వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇది కరెక్టు కాదు. బిల్లలతో ఎంతకాలం నెట్టుకొస్తారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూసుకోవాలి. మలబద్ధకం సమస్య ఎలా పోతుంది? ఏం చేయాలి? ఏ ఆహారాలు తీసుకోవాలి? అనే విషయాలపై దృష్టి సారించాలి. అప్పుడే మనకు ఓ పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది.
మలబద్ధకం సమస్య నివారణకు చక్కటి ఉపాయాలు మన ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పూర్తిగా నివారించాలంటే ఈ సమస్య ఉన్న వారు ఓ రెండు మూడు రోజులు ఎనిమా చేసుకోవాలి. తరువాత ఉదయం నిద్ర నుంచి లేవగానే లీటర్ పావు మంచినీళ్లు తాగాలి. తరువాత ఓ అరగంట తరువాత మళ్లీ ఓ లీటర్ పావు నీరు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల మలం సులభంగా బయటకు వస్తుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా నీళ్ల వల్ల మలం మొత్తం బయటపడుతుంది. ఇది చక్కని ఔషధం లాంటింది.

ఇంకా మనం తీసుకునే ఆహారం కూడా బలమైనది అయి ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటేనే మనకు ఫలితం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, మల్టీగ్రేన్ పిండితో చేసుకునే పుల్కాలు, ఓట్స్, పండ్లు వంటివి తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ తో మలబద్ధకం సమస్య రాదు. పండ్లు తొక్కతోనే తినాలి. కూరగాయలు కూడా తొక్కతోనే వండుకోవాలి. దీంతో మంచి ప్రొటీన్లు అంది మనకు మలబద్ధకం సమస్య అనేది లేకుండా చేస్తాయి. ఇలా మంచి పద్ధతులు పాటించి మలబద్ధకం సమస్య నుంచి దూరం కావాల్సిన అవసరం ఆ బాధలు పడుతున్న వారు కచ్చితంగా ఆచరించి మంచి ఫలితం అందుకోవాలి.