Walking Backwards Benefits: నడక ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల ఫిట్‌గా ఉండటంతో పాటు మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఏదైనా పార్క్‌కు పోయినప్పుడు ఎవరైనా కొత్తగా ఎక్సర్‌సైజ్ చేస్తే మనం చూసి నవ్వుకుంటాం. ఈ మనుషులు ఏంటి డిఫరెంట్‌గా ఉన్నారని అనుకుంటాం. వాళ్లు చేసే ఎక్సర్‌సైజ్‌లు మనకి తెలియక మనం అలా భావిస్తాం. కానీ అవి ఆరోగ్యానికి మంచిదని అందరూ నవ్వుకున్న వాటిని చేయడం మానరు. అయితే కొందరు వాకింగ్ ముందుకు కాకుండా వెనక్కి చేస్తుంటారు. ఇలాంటి వాళ్లను మీరు చూసే ఉంటారు. అయితే సాధారణంగా వాకింగ్ అంటే ముందుకు నడుస్తారు. ఇలా ముందుకు కాకుండా వెనక్కి నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కష్టమైన కొందరు వెనక్కి నడుస్తారు. మరి ఇలా వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
ముందుకు వంద అడుగులు నడిస్తే ఎంతో.. వెనక్కి ఒక్క అడుగు వేస్తే అన్ని బెనిఫిట్స్. సాధారణ వాకింగ్ కంటే వెనక్కి నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. దీనివల్ల తొందరగా బరువు తగ్గుతారు. అలాగే వెన్నునొప్పి, ఆర్థరైటిస్, మోకాళ నొప్పులు తగ్గుతాయి. రివర్స్‌లో నడవడం వల్ల గుండెకు వేగంగా రక్తాన్ని పంపిస్తుంది. దీంతో శరీర భాగాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్తం సరఫరా అవుతుంది. రివర్స్‌లో నడవడం వల్ల కాళ్లకు శక్తి పెరుగుతుంది. మోకాలి గాయాల నుంచి కూడా తొందరగా కోల్కోవచ్చు. రోజూ ఒక పదినిమిషాల పాటు వెనక్కి నడిస్తే ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. వెనక్కి నడవడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంద్రియాలను పదునుపెట్టి మానసిక, శారీరక సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పితో బాధపడుతున్నవాళ్లకి రివర్స్ వాకింగ్ మంచి ఫలితాలను ఇస్తుంది.
వెనక్కి నడవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఏకాగ్రత పెరగడంతో పాటు వ్యాయామం మీద విసుగు రాదు. నిద్ర బాగా పడుతుంది. కొంతమంది ఏదో ఒకటి ఆలోచిస్తూ వేరే లోకంలో ఉంటారు. ఇలాంటి వాళ్లు వెనక్కి నడిస్తే రిజల్ట్ మీరే చూస్తారు. వెనుకకు కేవలం నడక మాత్రమే కాకుండా రన్నింగ్ కూడా చేయవచ్చు. వెనక్కి రన్నింగ్ చేయడం వల్ల మోకాలి నొప్పి తగ్గుతుంది. అయితే వెనక్కి నడవడం చాలా కష్టమని కొందరు భావిస్తారు. కొత్తలో ఏ పని అయిన కష్టంగానే ఉంటుంది. అలవాటు అయ్యే కొద్ది సులువు అవుతుంది. మొదట్లో ఇంటి దగ్గర మెల్లగా కొద్దికొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. కొత్తలో కాళ్లు తడబడటం, అడుగులు పడకపోవచ్చు. కానీ అలవాటు అయితే రివర్స్ రన్నింగ్ కూడా చేస్తారు. పార్క్, గ్రౌండ్‌లో మాత్రమే కాకుండా ట్రెడ్‌మిల్‌పై కూడా రివర్స్ వాకింగ్, రన్నింగ్ చేయవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొత్త ఒత్తిడిగా అనిపించిన ఆ తర్వాత ఫలితం మీరే చూస్తారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More