onion : మనిషి ఆరోగ్యం కోసం పూర్తిగా మెడిసిన్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహర పదార్థాలు సక్రమంగా తీసుకున్నా.. హెల్దీగా ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో బిజీ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరూ సరైన ఫుడ్ తీసుకోకపోవడంతో రకరకాల రోగాల బారిన పడుతున్నారు. కానీ రోజూ తినే ఆహారంలో కొన్ని పదార్థాలను కచ్చితంగా ఉంచుకోవడం వల్ల కొన్ని వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా అధిక శక్తి కోసం ఇవి చాలా ఉపయోగపడుతాయి. వీటిలో ఉల్లి(Onion)చాలా ప్రధానమైనది. వంటింట్లో ఉల్లి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి కూరలో ఉల్లిపాయ కచ్చితంగా అవసరం ఉంటుంది. దీనిని కూరలో వేయడం వల్ల రుచిగా ఉండడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా శృంగార లైఫ్ కోసం ఉల్లి చాలా మేలు చేస్తుంది. అయితే పడకగదిలో రెచ్చిపోవడానికి ఉల్లిపాయ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..
‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’అని అంటారు. ఎందుకంటే ఉల్లిపాయలు తరిగినప్పుడు ఆటోమేటిక్ గా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి. దీంతో దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలో యాంటీ యాక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో దీనిని రోజూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులను దరి చేరకుండా కాపాడుతుంది. అలాగే పచ్చి ఉల్లిపాయలో ఫైభర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని కర్రీలోనే కాకుండా సలాడ్ లోనూ ఉపయోగించి నేరుగా తినవచ్చు. ఇందులో లభించే ఫైబర్ వల్ల శరీరంలో ఎలాంటి విష పదార్థం ఉన్న దానిని బయటకు వెళ్లగొడుతుంది. ఉల్లిపాయలు తరుచుగా తినడం వల్ల ఎముకలు గట్టిపడుతాయి.
ఉల్లి పాయ వల్ల సాధారణ ఆరోగ్యం మాత్రమే కాకుండా శృంగారంలో పటిష్టంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పురుషులకు ఇది చాలా మేలు చేస్తుందని కొందరు ఆరోగ్య నిపుణులు పేర్కొటున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు లిబిడోను పెంచడంలో తోడ్పడుతుంది. దీంతో శృంగారంపై ఆసక్తి పెరిగి భాగస్వామిని ఎక్కువ సంతృప్తి పరచడంలో విజయం సాధిస్తారు. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో క్వెర్సెటిన్, రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి.
ఇనరానియన్ జర్నల్ ఆఫ్ బేసిక్ మెడికల్ సైన్స్ లో ప్రచుచించిన ప్రకారం.. శరీరం మొత్త రక్త ప్రసరణ చేయడానికి ఉల్లిపాయనే మేలు చేస్తుందని పరిశోధకులు తేల్చారు. ఉల్లిపాయలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే కారకాలు ఉంటాయి. దీంతో ఇది పురుషుల్లో శృంగారాన్ని రేకెత్తించేందుకు ఉపయోగపడుతాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే ఇన్సూలిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. దీంతో లైంగిక పటిష్టం కోసం ఇవి సహకరిస్తాయి.
ఉల్లిపాయ నేరుగా తినడం వల్ల నోరు దుర్వాసన వస్తుందని కొందరి అభిప్రాయం. కానీ ఇదిచ్చే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీనిని ఎక్కువగా తీసుకోవడమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కర్రీలో వాడడం కంటే సలాడ్ లా తీసుకోవడం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు. అందువల్ల ప్రతిరోజూ భోజనంలో ఉల్లిపాయ కచ్చితంగా ఉండేలా చూసుకోండి..
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Do you know the benefits of onion for romance enhancement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com