National cancer awareness day 2024: కాలం మారుతున్న కొద్దీ కొత్త రకమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. మనుషులు ఆహారపు అలవాట్లు, కాలుష్య వాతావరణం కారణంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వీటిలో కొన్ని చికిత్స ద్వారా నయం అవుతుండగా.. మరికొన్ని ప్రాణాలు తీస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని భయపెడుతున్న వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి కారణంగా చాలా మంది ప్రాణలు కోల్పోతున్నారు. అయితే లేటేస్టుగా వస్తున్న టెక్నాలజీతో వైద్యులు క్యాన్సర్ న అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనుషుల్లో కూడా క్యాన్సర్ పై అవగాహన ఉండడం వల్ల ఈ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 7న క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఈ వ్యాధి నిర్మూలన కోసం అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి గురించి కొన్ని విశేషాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 97 లక్షల మంది మరణిస్తున్నారు. అయితే క్యాన్సర్ బారిన పడిన వారు 5.3 కోట్ల మంది కోలుకున్నట్లు అంచనా వేసింది. భారతదేశంలో 2022 సంవత్సరంలో 14.1 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 9.1 లక్షల మంది మరణిస్తున్నారు. క్యాన్సర్ పురుషులలో ఎక్కువగా నోటిలో, ఊపిరితిత్తుల్లో ఎక్కువగా వస్తుంది. మహిళల్లో రోమ్ము, గర్భాశయంలో క్యాన్సర్ వస్తుంటుంది. పురుషుల్లో కొత్త కేసులు 27 శాతం ఉండగా.. మహిళల్లో 18 శాతం నమోదవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారత్ లో 2022 , 2045 మధ్య క్యాన్సర్ మరణాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2020 వ సంవత్సరంతో పోలిస్తే 2025లో భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి 12.8 శాతం పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
క్యాన్సర్ దినోత్సవాన్ని మొదటి సారిగా 4 ఫిబ్రవరి 2000లో ప్యారిస్ లో నిర్వహించారు. న్యూ మిలినియం కోసం క్యాన్సర్ కు వ్యతిరేకంగా ‘చార్జర్ ఆఫ్ పారిస్’ పరిశోధనను ప్రోత్సహించడానికి అధికారిక వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తరువాత దీనిని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూనే చికిత్సకు సంబంధించిన కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో కంటే క్యాన్సర్ చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
భారతదేశంలో పొగాకు, ధూమపానం ఎక్కువగా వినియోగిస్తుంటారు. అందువల్ల క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇప్పటికే వీటిపై అవగాహన కోసం పలు వీడియోలను తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అయినా ప్రతీ ఏటా నవంబర్ 7న క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.అయితే బ్రిక్స్ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్యం సంస్థ అంచనా వేసింది. క్యాన్సర్ చికిత్సలో టెక్నాలజీని ఉపయోగించి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. అయితే ప్రజల్లో అవగాహన వచ్చిన తరువాత దీనిని పూర్తిగా నిర్మూలించవచ్చని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Do you know how many cancer cases are reported worldwide
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com