కాఫీ ఎక్కువగా తాగుతున్నారా.. ఆ సమస్యల బారిన పడినట్లే..?

మనలో చాలామంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే ఎక్కువసార్లు కాఫీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది తలనొప్పి సమస్యతో బాధ పడితే కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే వైద్యులు కాఫీ ఎక్కువగా తాగితే తలనొప్పి సమస్య తగ్గకపోగా ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. కాఫీ అంటే మరీ ఇష్టం ఉంటే రోజుకు రెండుసార్లు మాత్రమే తాగాలని అంతకు మించి తాగవద్దని వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు […]

Written By: Navya, Updated On : October 17, 2020 7:49 pm
Follow us on

మనలో చాలామంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే ఎక్కువసార్లు కాఫీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది తలనొప్పి సమస్యతో బాధ పడితే కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే వైద్యులు కాఫీ ఎక్కువగా తాగితే తలనొప్పి సమస్య తగ్గకపోగా ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. కాఫీ అంటే మరీ ఇష్టం ఉంటే రోజుకు రెండుసార్లు మాత్రమే తాగాలని అంతకు మించి తాగవద్దని వెల్లడిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు మైగ్రేన్ సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్లు పడే బాధ అంతాఇంతా కాదు. మనిషి ఏ మాత్రం తట్టుకోలేని స్థాయిలో వారిని తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. కాఫీ ఎక్కువగా తాగితే మైగ్రేన్ బారిన పడే అవకాశాలు ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భారత్ తో పోల్చి చూస్తే అమెరికన్లు ఎక్కువగా కాఫీ తాగుతున్నారు.

సంవత్సరానికి అమెరికన్లు ఏకంగా 400 బిలియన్ కప్పుల కాఫీని తాగుతున్నారని సమాచారం. శాస్త్రవేత్తలు కాఫీ వినియోగంపై విసృతమైన పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కాఫీలో ఎక్కువ మోతాదులో ఉండే కెఫిన్ మైగ్రేన్ తో బాధ పడే వాళ్లకు కాఫీ హాని కలిగిస్తుందని తెలుపుతున్నారు. కెఫిన్, తలనొప్పి, ఇతర ఆసక్తి కారకాలపై 42 రోజుల పాటు పరిశోధనలు చేసిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసినా మైగ్రేన్లు ఎందుకు వస్తాయో ఖచ్చితమైన కారణాలను మాత్రం కనిపెట్టలేకపోయారు. ఎవరైతే కాఫీ తాగారో వాళ్లు ఆ తర్వాత మైగ్రేన్ తో బాధ పడ్డారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కాఫీ తాగేవాళ్లు మైగ్రేన్ ఎక్కువగా పడుతూ ఉండటంతో వీలైఅనంత వరకు కాఫీ వినియోగాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.