Hand Shivering: మనలో చాలామంది చేతులు పదేపదే వణుకుతుండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువమంది ఈ సమస్యను చిన్న సమస్యగానే పరిగణిస్తారు. అయితే ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్పాంజ్ బాల్ లేదా రబ్బర్ వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా సమస్య తగ్గుతుంది.
బంతిని గట్టిగా నొక్కడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హ్యాండ్ డంబెల్ వ్యాయామం ద్వారా కూడా ఈ సమస్య తేలికగా దూరమవుతుంది. చేతులలో వణుకు తగ్గించడంలో ఈ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడితో పాటు నరాల అలసట తగ్గుతుంది. ఫింగర్ ట్యాప్ వ్యాయామం సాధారణ వ్యాయామం కాగా ఈ వ్యాయామం ద్వారా చేతివేళ్ల కదలికలను నియంత్రించవచ్చు.
Also Read: Janasena: జనసేనకు కొత్త రక్తం
ఈ జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గని పక్షంలో వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని మందులు వాడితే మంచిదని చెప్పవచ్చు. కొన్ని నాడుల పనితీరు కారణంగా ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఈ ఆరోగ్య సమస్యకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ కారణం లేకుండానే చేతులు వణుకుతాయి.
వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడని పక్షంలో కొన్నిసార్లు ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. సమస్య చిన్నదే అయినా దీర్ఘకాలంలో సమస్య తీవ్రమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: RRR Latest Collections : అన్నీ చోట్ల అదే విజృంభణ.. !