
కొత్త ఏడాదిలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే సాధారణ కరోనాతో పాటు కొత్తరకం కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇప్పటికే శాస్త్రవేత్తలు తయారు చేసిన వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని పలు దేశాల్లో పంపిణీ జరుగుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు జ్వరంతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని చెబుతున్నారు.
Also Read: బీ అలర్ట్..: దేశంలో మరో ఐదు కొత్త స్ట్రెయిన్ కేసులు
కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉంటే మాత్రమే తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్వరం ఉన్నా, అలర్జీ లక్షణాలు ఉన్నా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తులు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి.
Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్.. ?
గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల వివరలను వైద్యులకు తెలియజేయడంతో పాటు మహిళలు గర్భంతో ఉంటే ఆ వివరాలను ముందుగానే తెలియజేయాలి. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యులు వ్యాక్సిన్ ను ఇవ్వాలో వద్దో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోకూడదు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
కొంతమంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ గురించి అనవసర భయాందోళనలకు గురి కావద్దని.. భద్రతా ప్రమాణాలు పాటించి వ్యాక్సిన్లను తయారు చేశారు కాబట్టి అనవసర భయాందోళనకు ప్రజలు గురి కావద్దని ప్రజలకు సూచిస్తోంది.