Chanakya Niti- Money: డబ్బుకు లోకం దాసోహం. పైసా మే పరమాత్మ. డబ్బు లేనిదే ఏ పని కూడా కావడం లేదు. మానవ సంబంధాలు కూడా ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు భలే జబ్బుగా పట్టుకుంది. పైసుంటేనే విలువ ఇస్తున్నారు. లేదంటే తక్కువగా చూస్తున్నారు. దీంతో డబ్బు సంపాదించడానికి నానా మార్గాలు వెతుకుతున్నారు. కొందరు న్యాయంగా సంపాదిస్తే మరికొందరు అక్రమ మార్గాల్లో సంపాదిస్తుంటారు. ఏది ఏమైనా డబ్బుంటే అతడు మంచివాడా చెడ్డవాడా అనేది పట్టించుకోవడం లేదు. మనీ ఉంటే చాలు వారికి మర్యాదలు చేయడానికి వెనకాడటం లేదు.

సమాజంలో గొప్ప వారు ఎలా అవుతారు? వారి స్వయంకృషితో ఎదిగిన వారిని అందరు గౌరవిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి? అవి రావడానికి కారణాలు ఏముంటాయి? ప్రస్తుతం డబ్బు సంపాదించడానికి పలు దారులు తొక్కుతున్నారు. న్యాయంగా అయితే ఎవరు కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించలేరు. అక్రమ మార్గాల్లోనే ధనం సంపాదించుకోవచ్చు. దీన్ని గుర్తించిన కొందరు నీతిని పట్టించుకోకుండా అవినీతితో తమ సంపాదన పెంచుకుంటున్నారు.
ఆచార్య చాణక్యుడు డబ్బు సంపాదించే వారు ఎలా ఉండాలనేదానిపై స్పష్టత ఇచ్చాడు. నీతి, న్యాయం, ధర్మంగా సంపాదించే డబ్బు మనకు చెందుతుంది. కానీ అవినీతి, అక్రమ మర్గాల్లో సంపాదించినది మన దగ్గర ఉండదు. ఆగాన వచ్చింది బోగాన పోతుందని సెలవిచ్చాడు. మనిషి ధర్మ మార్గంలో ఎంత సంపాదించిన దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్రమంగా సంపాదిస్తే చివరకు తిప్పలు తప్పవు. డబ్బును మంచి దారిలోనే సంపాదిస్తే ఎలాంటి ఆపదలు రావు. ఈ క్రమంలో మనిషి మంచితనంగానే ముందుకు వెళ్లడం శిరోధార్యం.

చాణక్యుడు చెప్పిన విధంగా డబ్బు సంపాదించి సంఘంలో గౌరవం పొందాల్సిన అవసరం ఉంటుంది. డబ్బు సంపాదనలో నీతి ఉంటే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. భవిష్యత్ లో భయం రాదు. నీతితో మనం పది రూపాయలు సంపాదించిన అందులో ప్రశాంతత ఉంటుంది. అదే అవినీతితో కోట్లు సంపాదించినా మనసు నిబ్బరంగా ఉండదు. ఎప్పుడో ఏదో భయం వెంటాడుతుంది. చాణక్యుడు సూచించిన మార్గంలో డబ్బు సంపాదించి మంచి పేరు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.