Cardamom Health Benefits: మీ రోగాలన్నీ మటుమాయం చేసే యాలకులు.. ఇలా వాడండి

రోజు మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం సాఫీగానే సాగుతుంది. వంట గదిలో ఆయుర్వేద ఔషధ దినుసులు చాలానే ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే మనకు వ్యాధుల బాధ రానే రాదు. వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇలా వీటిని వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న సమస్యలను సులభంగా పోగొట్టుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : June 5, 2023 12:15 pm

Cardamom Health Benefits

Follow us on

Cardamom Health Benefits: మన వంటింట్లోనే చాలా రకాల మందులు ఉన్నాయి. వాటిని మనం గమనించడం లేదు. ఉల్లి నుంచి యాలకుల వరకు ఎన్నో రకాల రోగాలను నయం చేసే దినుసులు మన ఇంట్లోనే ఉంటాయి. కానీ వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదు. దీంతో మన రోగనిరోధక శక్తి సన్నగిల్లుతోంది. వాటిని మనం సరైన పద్ధతిలో వాడితే రోగాలన్ని దూరం కావడం సహజమే. ఈ నేపథ్యంలో వాటిని వాడుకుని మన అనారోగ్యాన్ని పోగొట్టుకోవాల్సిన సమయం వచ్చింది.

రోజు మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం సాఫీగానే సాగుతుంది. వంట గదిలో ఆయుర్వేద ఔషధ దినుసులు చాలానే ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే మనకు వ్యాధుల బాధ రానే రాదు. వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇలా వీటిని వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న సమస్యలను సులభంగా పోగొట్టుకోవచ్చు.

ఈనేపథ్యంలో మనం యాలకుల గురించి తెలుసుకోవాల్సిందే. అవి మన శరీరంలోని చాలా రోగాలను నయం చేస్తాయి. దాదాపు యాభై జబ్బులకు యాలకులు మందులా మారతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. నోటి దుర్వాసన వస్తుంటే రోజు ఉదయం బ్రష్ చేసుకున్నాక రెండు యాలకులతోపాటు రెండుపుదీనా ఆకులు నమిలి తింటే నోటి దుర్వాసన ఇక రానేరాదు.

గుడిలో ఇచ్చే ప్రసాదంలో కచ్చితంగా యాలకులు ఉంటాయి. అందులో ఉండే యాలకులను తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారి అభిప్రాయం. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి1, బి6, సి, ఫైబర్ కూడా ఉంటాయి. అందుకే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల చాలా వరకు రోగాలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.